Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం..కేబినెట్ కీలక నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం..కేబినెట్ కీలక నిర్ణయం

 Authored By sandeep | The Telugu News | Updated on :5 September 2025,3:00 pm

Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి అర్హ కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కొత్త యూనివర్సల్ హెల్త్ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధంగా ఏపీ దేశంలోనే తొలి రాష్ట్రంగా అత్యంత పెద్ద ఎత్తున ఉచిత వైద్య హక్కును ప్రజలకు కల్పించబోతోంది.

#image_title

3,257 వ్యాధులకు చికిత్స

ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతోన్న ఆరోగ్యశ్రీ (రూ.5 లక్షల వరకు) మరియు కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాలను విలీనం చేసి, వాటిని సమన్వయపరిచి ఒకే యూనివర్సల్ హెల్త్ పాలసీగా రూపొందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలుతో ఏపీలో ఆరోగ్య హక్కు సాధికారత స్థాయికి చేరనుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో మొత్తం 3,257 రకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొత్త పాలసీ అమలుతో ఈ సేవల పరిమితి మరింత విస్తరించనుంది. ప్రజలు అధునాతన వైద్యం కోసం ఇకపైనా పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రంలోనే అత్యుత్తమ మెడికల్ సదుపాయాలను పొందగలుగుతారు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి