Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం..కేబినెట్ కీలక నిర్ణయం
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి అర్హ కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కొత్త యూనివర్సల్ హెల్త్ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధంగా ఏపీ దేశంలోనే తొలి రాష్ట్రంగా అత్యంత పెద్ద ఎత్తున ఉచిత వైద్య హక్కును ప్రజలకు కల్పించబోతోంది.

#image_title
3,257 వ్యాధులకు చికిత్స
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతోన్న ఆరోగ్యశ్రీ (రూ.5 లక్షల వరకు) మరియు కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాలను విలీనం చేసి, వాటిని సమన్వయపరిచి ఒకే యూనివర్సల్ హెల్త్ పాలసీగా రూపొందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలుతో ఏపీలో ఆరోగ్య హక్కు సాధికారత స్థాయికి చేరనుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో మొత్తం 3,257 రకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొత్త పాలసీ అమలుతో ఈ సేవల పరిమితి మరింత విస్తరించనుంది. ప్రజలు అధునాతన వైద్యం కోసం ఇకపైనా పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రంలోనే అత్యుత్తమ మెడికల్ సదుపాయాలను పొందగలుగుతారు.