Health Tips | బరువు తగ్గడంలో అరటి vs ఆపిల్ ..ఈ రెండింటిలో ఏది ఉత్తమం?
Health Tips | బరువు తగ్గాలనుకునే వారు పండ్లలో ఎక్కువగా తీసుకునేవి అరటి, ఆపిల్. జిమ్‌కు వెళ్లే వారు, వ్యాయామం చేసే వారు ఈ రెండు పండ్లను తరచూ డైట్‌లో చేర్చుకుంటారు. అయితే బరువు తగ్గడానికి ఏది నిజంగా బెటర్? పోషకాలు, కేలరీలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను పోల్చితే సమాధానం కొంత స్పష్టమవుతుంది.

#image_title
అరటి పండు ప్రయోజనాలు:
అరటిలో అధికంగా ఉండే పొటాషియం శరీర ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా *ఫైబర్* ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే అరటి, త్వరగా శక్తిని ఇస్తుందనే కారణంగా వ్యాయామం తర్వాత తీసుకోవడానికి సరైన ఎంపికగా భావిస్తారు.
ఆపిల్ ప్రయోజనాలు:
ఆపిల్‌లో *ఫైబర్* అధికంగా ఉండటంతో కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. *యాంటీఆక్సిడెంట్లు* సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుండి రక్షిస్తాయి. అలాగే ప్రీబయోటిక్ ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఆపిల్ మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
నిపుణుల ప్రకారం అరటిపండు, ఆపిల్ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ బరువు తగ్గాలనుకునే వారికి ఆపిల్ కొంచెం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్‌తో ఆపిల్ బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అయితే శరీరానికి త్వరగా శక్తి కావాలనుకుంటే అరటిపండే ఉత్తమం.