Vegetables Seller : కూర‌గాయ‌లు బేర‌మాడే వాళ్లు ఈ అమ్మాయి మాట‌లు వినండి.. క‌న్నీళ్లు ఆగ‌వు

Authored By mallesh | The Telugu News | Updated on : 18 June 2022, 7:00 am

Vegetables Seller : ఇటీవ‌ల కాలంలో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ బాగా సంద‌డి చేస్తున్నాయి. అయితే గ‌తంలో లాగా ల‌వ్ స్టోరీస్.. ఇంక ఇత‌ర ప‌నికిరాని అంశాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ చేసి అలాంటి వీడియోల‌నే తీసేవారు. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ప్ర‌తి షార్ట్ ఫిలింమ్ లో ఏదో ఒక అంశం ఫోకస్ చేసి వాటి విలువ పెంచుతున్నారు. ఎన్నో స‌మ‌స్య‌ల‌పై, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంపై, రైతుల‌పై, ఉద్యోగుల క‌ష్టాల‌పై, వృద్దుల ఆవేద‌న‌పై ఇలా ఎన్నో వీడియోస్ తీసీ ఆక‌ట్టుకుంటున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో రైతు క‌ష్టాల‌పై వ‌చ్చిన ఓ షార్ట్ ఫిలిమ్ ఆలోచించేలా చేసింది. చాలా మందికి రైతుల క‌ష్టాలు ప‌ట్ట‌వు.. కార్లు బంగ్లాలు ఉంటాయి..

పార్టీల‌కు ఫంక్ష‌న్ల‌కు ల‌క్ష‌ల్లో డ‌బ్బు ఖ‌ర్చు పెడ‌తారు. కానీ.. రైతు పండించిన పంట‌కు కాస్త ధ‌ర‌పెట్టండంటే మాత్రం బేరం ఆడుతారు. సూప‌ర్ మార్కెట్ల‌లో నిర్ణ‌యించిన ధ‌ర‌కే ఇక్క‌డ ఫిక్స్ డ్ రేట్లు అని మాట్లాడ‌కుండా కొనుగోలు చేసుకుని వెళ్లిపోతారు. అదే ఒక రైతు కూర‌గాయ‌లు గ‌ల్లీల్లో, కాల‌నీల్లో, మార్కేట్ల‌లో అమ్మితే మాత్రం బేరం ఆడుతారు. అక్క‌డే వాళ్ల డ‌బ్బు మొత్తం ఖ‌ర్చు అయిపోతుంది అన్న‌ట్లు మాట్లాడ‌తారు. రైతుల క‌ష్టాల‌పై ఎన్నో సినిమాలు వ‌చ్చాయి కానీ వాళ్ల క‌ష్టాలు మాత్రం తీర‌లేదు. పెద్ద‌పెద్ద హోట‌ల్స్ లో తిన్న కొంచెం ఫుడ్ కి వంద‌ల‌కు వంద‌లు బిల్లు వేస్తే అన్నీ మూసుకుని పే చేస్తారు.

heart touching words from Vegetable Seller

heart touching words from Vegetable Seller

Vegetables Seller : రైతుల క‌ష్టాలు చెప్పిన యువ‌తీ..

అదే ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల‌ను పండించి క‌ష్ట న‌ష్టాల‌కు ఓర్చుకుని మార్కెట్ కి తెస్తే మ‌త్రం ఇక్క‌డ ఐదుకి ప‌దికి బేరాలాడుతుంటారు కొంద‌రు. కాగా ఈ షార్ట్ ఫిలింమ్ లో కూర‌గాయలు అమ్మే యువ‌తీ బేర‌మాడిన జ‌ల్సాలు చేసే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి త‌గిన బుద్ది చెప్తుంది. రైతుల క‌ష్టాలు చెప్పి వ్య‌వ‌సాయం విలువ తెలిసేలా చేస్తుంది. రైతు బిడ్డ‌ను అంటూ వాట్సాప్ స్టేట‌స్ ల‌లో చెప్పుకుంటే స‌రిపోద‌ని గుణ‌పాఠం నేర్పింది. తాను పై చ‌దువులు చ‌దువుకున్నా కూడా సిగ్గుప‌డ‌కుండా న‌చ్చిన ప‌నిచేస్తూ రైతుల విలువ పెంచుతోంది. అదేంటొ మీరు కూడా చూసేయండి.

Also read

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp