
heart touching words from Vegetable Seller
Vegetables Seller : ఇటీవల కాలంలో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ బాగా సందడి చేస్తున్నాయి. అయితే గతంలో లాగా లవ్ స్టోరీస్.. ఇంక ఇతర పనికిరాని అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేసి అలాంటి వీడియోలనే తీసేవారు. కానీ ఈ మధ్యకాలంలో మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి షార్ట్ ఫిలింమ్ లో ఏదో ఒక అంశం ఫోకస్ చేసి వాటి విలువ పెంచుతున్నారు. ఎన్నో సమస్యలపై, మధ్యతరగతి కుటుంబంపై, రైతులపై, ఉద్యోగుల కష్టాలపై, వృద్దుల ఆవేదనపై ఇలా ఎన్నో వీడియోస్ తీసీ ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రైతు కష్టాలపై వచ్చిన ఓ షార్ట్ ఫిలిమ్ ఆలోచించేలా చేసింది. చాలా మందికి రైతుల కష్టాలు పట్టవు.. కార్లు బంగ్లాలు ఉంటాయి..
పార్టీలకు ఫంక్షన్లకు లక్షల్లో డబ్బు ఖర్చు పెడతారు. కానీ.. రైతు పండించిన పంటకు కాస్త ధరపెట్టండంటే మాత్రం బేరం ఆడుతారు. సూపర్ మార్కెట్లలో నిర్ణయించిన ధరకే ఇక్కడ ఫిక్స్ డ్ రేట్లు అని మాట్లాడకుండా కొనుగోలు చేసుకుని వెళ్లిపోతారు. అదే ఒక రైతు కూరగాయలు గల్లీల్లో, కాలనీల్లో, మార్కేట్లలో అమ్మితే మాత్రం బేరం ఆడుతారు. అక్కడే వాళ్ల డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది అన్నట్లు మాట్లాడతారు. రైతుల కష్టాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ వాళ్ల కష్టాలు మాత్రం తీరలేదు. పెద్దపెద్ద హోటల్స్ లో తిన్న కొంచెం ఫుడ్ కి వందలకు వందలు బిల్లు వేస్తే అన్నీ మూసుకుని పే చేస్తారు.
heart touching words from Vegetable Seller
అదే ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను పండించి కష్ట నష్టాలకు ఓర్చుకుని మార్కెట్ కి తెస్తే మత్రం ఇక్కడ ఐదుకి పదికి బేరాలాడుతుంటారు కొందరు. కాగా ఈ షార్ట్ ఫిలింమ్ లో కూరగాయలు అమ్మే యువతీ బేరమాడిన జల్సాలు చేసే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి తగిన బుద్ది చెప్తుంది. రైతుల కష్టాలు చెప్పి వ్యవసాయం విలువ తెలిసేలా చేస్తుంది. రైతు బిడ్డను అంటూ వాట్సాప్ స్టేటస్ లలో చెప్పుకుంటే సరిపోదని గుణపాఠం నేర్పింది. తాను పై చదువులు చదువుకున్నా కూడా సిగ్గుపడకుండా నచ్చిన పనిచేస్తూ రైతుల విలువ పెంచుతోంది. అదేంటొ మీరు కూడా చూసేయండి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.