Salt | ఉప్పు ఎక్కువైతే శరీరానికి ముప్పు… నిపుణుల హెచ్చరిక! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Salt | ఉప్పు ఎక్కువైతే శరీరానికి ముప్పు… నిపుణుల హెచ్చరిక!

 Authored By sandeep | The Telugu News | Updated on :16 October 2025,5:00 pm

Salt | కూరలు, వంటకాలు రుచిగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరి. కానీ దాన్ని మితంగా వాడకపోతే ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువగా తీసుకున్నా శరీరానికి అవసరమైన సోడియం లభించదు, ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు అనేక సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

#image_title

ఉప్పు అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?

ఉప్పులో ఉండే సోడియం స్థాయి పెరిగితే రక్తపోటు (Blood Pressure) పెరగడం, గుండె సమస్యలు (Heart Problems), మూత్రపిండాల (Kidney) పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. రాత్రివేళల్లో తరచూ టాయిలెట్‌కి వెళ్ళాల్సి వస్తే అది అధిక ఉప్పు వాడకం కారణం కావొచ్చు.

శరీరంలో నీటి స్థాయిలు అసమతుల్యమై, ఎక్కువగా దాహం వేయడం, పాదాలు ఉబ్బడం, కాళ్లలో నీటి నిల్వ (Water Retention) వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.హైబీపీ ఉన్నవారికి ఈ ప్రభావం మరింత ప్రమాదకరం. వైద్య నిపుణుల ప్రకారం, ఎక్కువ ఉప్పుగా తినే వారికి ఆహారం అసలైన రుచి లేకుండా మారుతుంది.అలాగే అధిక సోడియం కాల్షియం స్థాయిలను తగ్గిస్తుంది, దీని వల్ల కాళ్లలో తిమ్మిర్లు, కీళ్ల నొప్పులు, అలసట వంటి సమస్యలు వస్తాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది