Hero Eddy : హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు..
Hero Eddy : ప్రస్తుతం ఎలక్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ఖర్చులను భరించలేక చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు సైతం ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. హీరో కంపెనీ నుంచి రిలీజ్ అయిన కొత్త ఎలక్ట్రిక్ బైక్ కు పేరు ఎడ్డీ. దీనిని డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, హెల్మెట్ అవసరం లేదు. మరి దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ హీరో ఇండియాలోకి మరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను తీసుకొచ్చింది. హీరో ఎడ్డీ పేరుతో ఈ మోడల్ ను ఇంట్రడ్యూస్ చేసింది.
దీని ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.72వేలు. స్టైలిష్ డిజైన్ తో ఈ బైక్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తోంది. పట్టణాల్లో ఉండేవాళ్లు చిన్న చిన్న అవసరాలకు, దగ్గర్లోని ప్రాంతాలకు వెళ్లేందుకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పటికే కొన్ని మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన హీరో కంపెనీ.. ప్రస్తుతం ఎడ్డీని ఇంట్రడ్యూస్ చేసింది. ఇక ఈ బైక్‌కు ఈ-లాక్, ఫైండ్ మై బైక్, రివర్స్ మోడ్, లార్జ్ బూట్ స్పేస్, ఫాలోమీ హెడ్‌ల్యాంప్స్ లాంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.

hero company launches new electric bike
Hero Eddy : నో హెల్మట్, నో లైసెన్స్..
దీనిని నడిపేవారు ఎలాంటి ఇబ్బంది లేకుండా జర్నీ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. దీనిపై గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 85కిలోమీటర్లు వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల టైం పడుతుంది. దీనిపై దూర ప్రయాణాలు చేయడానికి వీలుండదు. ఇదొక్కడే దీనికి మైనస్ అని చెప్పొచ్చు. ఇక ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలనుకునేవారికి వెహికిల్ ఫైనాన్స్ ఇచ్చేందుకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. బైక్ పై మీరూ ఓ లుక్కెయ్యండి..