Hero : డబ్బుల కోసం ఇలాంటి సినిమాలు చేస్తావా .. ఛీ నీ బతుకు .. హీరో కి పెళ్ళాం చివాట్లు !
Hero : బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పేయ్ తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఒక సినిమాలో చేసిన పాత్ర తన భార్యకు నచ్చలేదని దీంతో ఆమె చివాట్లు పెట్టిందని చెప్పకు వచ్చారు. ఇక మనోజ్ బాజ్ పేయి తెలుగులో అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. అయితే తన సినిమాలో ఎంపిక విషయంలో వచ్చిన మార్పుల గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలను వెల్లడించారు. గతంలో తాను నటించిన ఓ సినిమాను థియేటర్లో చూడటానికి తన భార్య వెళ్లిందని, ఆ సినిమా పేరును తాను చెప్పాలని అనుకోవడంలేదని చెప్పారు.
అదొక బ్యాడ్ మూవీ. అందులో నేను హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ఉంటా. నా పాత్రను చూసి థియేటర్లో కొందరు అమ్మాయిలు చులకనగా మాట్లాడారు. సినిమా అయిపోయాక నా భార్య నాకు ఫోన్ చేసి డబ్బులు కోసం ఇలాంటి సినిమాలు చేస్తున్నారా, ఇలాంటి సినిమాలు చేయడం మానేయండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. థియేటర్లో ఉన్న వారి మాటలు విని చాలా అవమానంగా ఫీల్ అవుతున్నా. ఇక ఇప్పటినుంచి అలాంటి సినిమాలు చేయడం మానేయండి అంటూ చివాట్లు పెట్టింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అప్పటినుంచి మనోజ్ బాజ్ పేయి సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారట.
ఆ రోజు నుంచి సినిమాల ఎంపిక విషయంలో మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. తన భార్యకు మాటకు తగ్గట్లే అప్పటినుంచి సినిమాల్ని ఎంపిక చేసుకునే విషయంలో మార్పు వచ్చిందని, ప్రేక్షకులకు చేరువయ్యే పాత్రలని చేయడం మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. దీంతో మనోజ్ బాజ్ పేయి మాటలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు మనోజ్ బాజ్ పేయి చేసిన ఆ సినిమా ఏంటా అని జనాలు సందేహం లో పడ్డారు. కొందరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో ప్రముఖ నటులలో ఒకరిగా మనోజ్ బాజ్ పేయ్ ఉన్నారు. అనేక సినిమాలలో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.