Heat Wave : ఏళ్ల రికార్డ్.. ఏప్రిల్ లోనే ఎండ ఇలా ఉంటే రాబోయే రోజుల పరిస్థితి ఏంటీ?
Heat Wave : ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలో కూడా ఎండలు మండిపోతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరంలో కూడా గత సంవత్సరం కంటే ఎక్కువగా ఎండలు కాస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం నూట ఇరవై రెండేళ్ల తర్వాత అత్యధిక నమోదయింది అంటూ వార్తలు వస్తున్నాయి. వాతావరణ శాఖ వారు అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. సాధారణంగా భారత దేశంలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఏప్రిల్ నెల నుండి అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవ్వడం జరుగుతోంది.ఏప్రిల్ నెలలో నమోదైన ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ వారిని కూడా షాక్ కి గురి చేస్తున్నాయి.
మధ్య భారతంలో 122 ఏళ్ల తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి అంటూ వాతావరన శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే రాబోయే మే నెలలో ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది అంటూ జనాలు బెంబేలెత్తి పోతున్నారు. రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ తో పాటు ఇంకా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ముందు ముందు భారీగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితికి వస్తే.. ఏప్రిల్ రెండో వారం నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. ప్రతి ఒక్కరు మే నెల నుండి మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

highest heat wave in india in coming days
తెలుగు రాష్ట్రాల్లో ముందు ముందు మరింత కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి నీరు ఎక్కువగా తాగాలి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు వస్తే ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లకూడదు అంటూ ప్రభుత్వాలు జారీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.