
History of Man has reincarnation means another birth in video
Reincarnation : మనిషికి పునర్జన్మ ఉంటుంది అంటే మరో జన్మ ఉంది అంటే మీరు నమ్ముతారా? ఈ గత జన్మ కాన్సెప్ట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఇలా వచ్చిన అన్ని సినిమాలు హిట్ గానే నిలిచాయి. ఎగ్జాంపుల్ మన తెలుగులో వచ్చిన మగధీర, ఈగ సినిమాలు గత జన్మకు సంబంధించినవే. ఇది సినిమా, ఎలాగైనా సృష్టించవచ్చు, ఓకే. మరి రియల్ లైఫ్ లో ఇలా జరగటానికి చాన్స్ ఉందా లేదా అంటే కొందరు ఉంది అంటున్నారు. ఇలా జరుగుతుంది అని మన ఇండియాలో జరిగిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన నిరూపించింది. మన హిందూ పురాణాల్లో సైతం ఆత్మ గురించి పునర్జన్మ గురించి స్పష్టంగా తెలపడం జరిగింది. గత జన్మ ఉంది అని నిరూపించిన ఒక వ్యక్తి జీవితం గురించి ఈ వీడియోలో మీకు తెలపబోతున్నాను. మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ కు సబ్ స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. 1902, జనవరి 18 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.
ఆమె పేరు లక్ష్మీదేవి.అప్పట్లో బాల్యవివాహాల కారణంగా దేవికి 10 సంవత్సరాల వయసులోనే ఒక బట్టల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేశారు. అతని పేరు కేదార్నాథ్ కేదార్నాథ్ కి ఇది రెండో పెళ్లి. ఎందుకంటే అతని మొదటి భార్య పెళ్లయిన కొంతకాలానికి చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక కేదార్నాథ్ కి, దేవితో వివాహం అయ్యాక పుట్టిన మొదటి బిడ్డ పుట్టగానే చనిపోయింది. తర్వాత రెండోసారి వీరికి ఒక కొడుకు జన్మించాడు. కానీ కొడుకు పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత అనారోగ్య సమస్యలతో దేవి 1925 అక్టోబర్ 4న తన 23 ఏళ్ల వయసులో చనిపోయింది. ఇక్కడి వరకు కాసేపు ఈ కథను ప్రక్కన పెడితే దేవి చనిపోయిన తర్వాత సంవత్సరంలో అంటే 1926 డిసెంబర్ 12 ఢిల్లీలోని బాబురావు బహదూర్ అనే వ్యక్తికి కూతురు పుడుతుంది. ఒకరోజు ఈ పాప తన తల్లితో అమ్మ నాకు పునర్జన్మ ఉంది. ఈ జన్మలో కేదార్నాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. మాకు ఒక కొడుకు కూడా పుట్టాడు.
మాకు మధురలో ఒక బట్టల షాపు ఉంది. నన్ను నా భర్త దగ్గరకు పంపించండి అని చెప్పింది. ఈ మాటలు విని శాంతిదేవి తల్లి ఒక్కసారి షాక్ అయింది. మొదట్లో శాంతిదేవి తల్లి తన కూతురు మాటలను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత తన హస్బెండ్ ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అని వారు శాంతిదేవిని అడగగా తన భర్త తెల్లగా ఉంటాడని, కళ్ళజోడు పెట్టుకుంటాడని మధురలో ద్వారకా టెంపుల్ కి ఎదురుగా బట్టల షాపు ఉంటుందని, దానిలోనే ఆయన ఉంటారని చెప్పగా వీళ్ళు ఎంక్వయిరీ చేసి చూస్తే నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నారు. చివరకు ఆమె తల్లిదండ్రులు మధురలోని ఆ వ్యక్తికి ఒక ఉత్తరం రూపంలో అన్ని విషయాలను రాసి పంపుతారు. అది చదివిన కేదార్నాథ్ కూడా తన భార్య మళ్ళీ పుట్టడం ఏంటి అని షాక్ కి గురి అవుతాడు. శాంతిదేవి నా గురించి, నా కుటుంబం గురించి తెలిపిన విషయాలన్నీ నిజమేనని కేదార్నాథ్ తిరిగి వాళ్ళకి ఉత్తరం పంపిస్తాడు.
దాంతో చివరికి వారి తల్లిదండ్రులు ఇవన్నీ నిజమేనని నమ్ముతారు. అప్పట్లో ఈ విషయం సంచలనం రేపడంతో, న్యూస్ పేపర్ లోకి రావడంతో గాంధీ గారు చూసి ఆయనకి స్వయంగా శాంతిదేవిని కలిసి, తనతో మాట్లాడి ఆమె కోసం 1935 లో ఒక ఇన్వెస్టిగేషన్ టీం ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆ టీం వారు శాంతిదేవిని మధుర తీసుకెళ్లగా తన ఇంటికి ఎలా వెళ్లాలో కూడా శాంతి దేవి దారి చూపించి అలా నేరుగా ఇంటికి తీసుకెళ్ళింది. వెళ్లి తన భర్తను తన కొడుకుని తన అక్కచెల్లెళ్లని అందరిని కలిసింది. అందరిని గుర్తుపట్టింది. తాను ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోయానని అందుకే ఇలా మళ్లీ తిరిగి వచ్చానని చెబుతుంది.
ఇలా ప్రతి ఒక్కరిని చూస్తూ గమనిస్తూ వచ్చిన ఇన్వెస్టిగేషన్ టీం వారు సైతం చివరికి శాంతి దేవికి తనకు గత జన్మలో పెళ్లి అయిందని రిపోర్ట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తనకు గత జన్మలో పెళ్లయిందని ఉద్దేశంతో శాంతిదేవి మరలా పెళ్లి చేసుకోకుండా అక్కడే వారితోనే బ్రతుకుతుంది. ఇలా చివరికి 1987 డిసెంబర్ 27న తన 61 ఏళ్ల వయసులో శాంతిదేవి మరణించింది. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.