
virat kohli gets trolling by fans
virat kohli : గత కొద్ది రోజులుగా కోహ్లీని నెటిజన్స్ ఉతికి ఆరేస్తున్నారు. ఆయనపై ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా కోహ్లీ ఆటతీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 259 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్యఛేదనలో భారత్ జట్టు మూడో ఓవర్‌లోనే శిఖర్ ధావన్ (1) వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (17: 22 బంతుల్లో 3×4) మూడు బౌండరీలు కొట్టినా.. మరోసారి తన పాత పద్ధతిలో పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. నువ్వు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
virat kohli gets trolling by fans
మొన్నటి వరకు నెటిజన్స్ మాత్రమే కోహ్లీపై మాటల దాడి చేసేవారు. కాని ఇప్పుడు అభిమానులు కొందరు కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ గెలిచింది కాబట్టి కొంతలో కొంత సేఫ్ అయ్యావు. లేదంటే దారుణ పరిస్థితులని ఎదుర్కోవలసి వచ్చేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ పేలవ ఫామ్ నేపథ్యంలో అతనిపై అనేక సెటైర్స్ పేలుతున్నాయి. గత మూడేళ్లగా విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఒక్క సెంచరీ కూడా చేయని మాట నిజం. కానీ మూడు ఫార్మాట్లలో కలిపి అతను 24 హాఫ్ సెంచరీలు చేశాడనేది కూడా అంతే వాస్తవం. భారత జట్టులో మరే బ్యాటర్ కూడా కోహ్లీ కంటే మెరుగ్గా ప్రదర్శన చేయలేదు.
అయినా కోహ్లీలో ఫామ్‌లో లేడు. అతన్ని జట్టు నుంచి తప్పించాలి. గత వారం రోజులుగా వినిపిస్తున్న విమర్శలు. స్థాయికి తగ్గ ప్రదర్శనలా అనిపించడం లేదు. ఆ క్రమంలోనే విరాట్‌పై నోరుపారేసుకుంటున్నారు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరి సెంచరీ బాదిన విరాట్ ఆ తర్వాత మొత్తం 24 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో 85 పరుగులకు పైగా 6 సార్లు చేశాడు. వెస్టిండీస్‌తో 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ 24 హాఫ్ సెంచరీలకు సంబంధించిన వీడియోలను రతన్ దీప్ అనే ట్విటర్ యూజర్ పంచుకున్నాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.