ysrcp : మంత్రి పదవిపై ఏపీ మండలి సభ్యుల్లో ఆశలు.. అదృష్టం ఎవరిదో…!
ysrcp : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారో ఎవరికి అంతుచిక్కడం లేదు. ఆయన నిర్ణయాల్లో ఎవరి ప్రమేయం కూడా ఎక్కువగా ఉండదు. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును రద్దు చేసే విషయం సైతం లాస్ట్ మినిట్ వరకు ఎవరికీ తెలియదు. అదే రోజు మార్నింగ్ సీఎంఓ నుంచి లీకులు వచ్చాయి. అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం అప్పటివరకు బయటకు రాలేదు. అనంతరం నిర్ణయంపై ప్రచారం జరిగింది.ఇక తాజాగా శాసనమండలి రద్దు అంశాన్ని సైతం జగన్ వెనక్కి తీసుకున్నారు.
ysrcp : నేతల్లో మళ్లీ ఆశలు..
దీంతో కేబినెట్ లో చోటుపై కొందరిలో ఆశలు పెరిగాయి. మొదటి నుంచి మండలిని జగన్ రద్దు చేస్తారని అందరూ భావించారు. ఇక మండలిలోని సభ్యులకు కేబినెట్‌లో చాన్స్ ఉండదని అంతా సైలెంట్ అయ్యారు. కానీ తాజాగా ఆయన మండలి రద్దు విషయంలో బ్యాక్ స్టెప్ వేయడంతో సభ్యుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తర్వలోనే కేబినెట్ ను జగన్ విస్తరిస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుందడటంతో తమకు సైతం అందులో చాన్స్ వస్తుందని సంతోషపడుతున్న మండలి సభ్యులు.పదవి వచ్చిన రాకున్న ప్రయత్నం మాత్రం చేస్తే తప్పేముందని ఆలోచిస్తున్నారు.
వచ్చే ఏడాది మొదట్లో కేబినెట్ విస్తరణ ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మండలిలో ఉన్న రవీంద్ర, త్రిమూర్తులు, ఇక్బాల్ వంటి వారు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. మండలి సభ్యుల్లో మొన్నటి వరకు కేబినెట్ పై ఆశలు లేవు. కానీ తాజాగా మండలి రద్దు విషయంలో జగన్ వెనక్కి తగ్గడంతో వారిలో ఉత్సాహం పెరిగింది. దీంతో ఇప్పటి నుంచి ప్రదక్షిణలు మొదలయ్యాయి. సీఎం దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు షురూ అయ్యాయి. మరి నిజంగానే శాసన మండలి సభ్యులకు కేబినెట్‌లో చాన్స్ వస్తుందా? అలా వస్తే ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది అంటూ అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయం తేలాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టక తప్పదు మరి.