Horlicks : వామ్మో హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదా… మరి ఇన్నేళ్లుగా జరిగిందేంటి…!
Horlicks : ప్రస్తుత కాలంలో చాలామంది మార్కెట్లో లభించే హెల్త్ డ్రింక్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ హెల్త్ డ్రింక్స్ వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందనేది అందరి నమ్మకం. అయితే తాజాగా కోట్లాదిమంది ప్రజలు ఎప్పటినుండో హెల్త్ డ్రింకుగా పరిగణిస్తున్న హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదని సదరు కంపెనీ తెలియజేసింది.అయితే ఇప్పటివరకు హార్లిక్స్ ను సదరు కంపెనీ హెల్త్ డ్రింకుగా పేర్కొనడం గమనార్హం.అయితే ఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కామర్స్స్ ప్లాట్ ఫామ్ లో విక్రయిస్తున్న డైరీ ఉత్పత్తులు లేబులింగ్ చేయకూడదని సూచించింది. అలాగే తృణ దాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు ఆరేంజ్ , లైమ్ వంటి పేర్లతో మార్కెట్లో లభిస్తున్న హెల్త్ డ్రింక్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలియజేసింది.
అంతేకాక ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దంటూ కేంద్రం సూచించింది. దీంతో ఇప్పటికే చాలా సంస్థలు వారు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులపై లేబిలింగ్ మార్పులు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే తమ ఉత్పత్తులపై కామెంట్ చేయడం ద్వారా డ్యామేజ్ జరిగే దాన్ని ఎదుర్కోవడం కంటే ముందుగానే తమను తాము మార్చుకోబోతున్నాం అన్నట్లు కంపెనీలు ప్రవర్తిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇటీవల హెల్త్ డ్రింక్ గా ఎంతో పేరు పొందిన హార్లిక్స్ తన లేబులింగ్ లో మార్పులు చేయడం జరిగింది.
Horlicks : లేబ్లింగ్ లో మార్పులు చేసిన హార్లిక్స్..
దేశవ్యాప్తంగా వస్తూ ఉత్పత్తులలో ఎంతో పేరు పొందినటువంటి హిందుస్థాన్ యూనిలీవర్ ఇటీవల తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్ పై కీలక మార్పులు చేసింది. అయితే గతంలో హార్లిక్స్ ను హెల్త్ ఫుడ్ డ్రింక్ కేటగిరీలో ఉంచగా ఇప్పుడు దానిని ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ కేటగిరీలోకి మార్పు చేసింది. ఈ విధంగా మార్చడానికి గల ప్రధాన కారణం కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అని చెప్పాలి. ఇటీవల ఈ శాఖ జారీ చేసిన ఆదేశాల కారణంగానే దీనిని మార్పు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు హెల్త్ డ్రింక్ గా ఉన్నటువంటి హార్లిక్స్ ను ఇప్పుడు డ్రింక్స్ పానీయాలు కింద పేర్కొన్నారు.అయితే ఇన్నాళ్లు జరిగిందేంటి..?ఇన్నేళ్లుగా హెల్త్ డ్రింక్ పేరుతో కంపెనీలు అమ్మేసిన తీరు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామాలు ఎన్ని వెలుగు చూస్తాయో…