Smart Phone : ఫోన్ సైలెంట్ లో పెట్టి ఎక్కడో మరిచిపోయారా? అయితే.. ఈ ట్రిక్ మీకోసమే.. ఇలా ఈజీగా కనిపెట్టేయొచ్చు
Smart Phone : ఇది స్మార్ట్ ఫోన్ యుగం. స్మార్ట్ ఫోన్ లేని కాలాన్ని మనం ఇప్పుడు ఊహించగలమా? స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక గంట కూడా మనం ఉండలేం. అంతలా స్మార్ట్ ఫోన్ మన జీవితాల్లోకి ఎక్కేసింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ తోనే జీవితం. స్మార్ట్ ఫోన్ తోనే అంతా. ఈ నేపథ్యంలో చాలా మంది స్మార్ట్ ఫోన్లు వచ్చాక మతిమరుపు తెచ్చుకుంటున్నారు. ఒక్క ఫోన్ నెంబర్ కూడా గుర్తుంచుకోవడం లేదు. అన్నీ అందులోనే. బ్యాంక్ అకౌంట్ల వివరాల దగ్గర్నుంచి.. పర్సనల్ విషయాలు, ఫోటోలు, వీడియోలు, ఫోన్ నెంబర్లు.. ఇలా ఒక్కటేంటి.. అన్నీ స్మార్ట్ ఫోన్ లోనే. ఒక్క క్షణం స్మార్ట్ ఫోన్ లేకపోతే మన చేతులు, కాళ్లు ఆడవు. అలాంటిది.. సడెన్ గా మన ఫోన్ కనిపించకపోతే ఏం చేస్తాం.
ఒకవేళ పోతే.. ఎక్కడైనా మిస్ అయితే.. ఇంకేమన్నా ఉందా? ఫోన్ పోవడం పక్కన పెడితే.. ఆ ఫోన్ కోసం ఎంతో టెన్షన్ పడతాం. చివరకు ఆ ఫోన్ దొరకకపోతే ఇక ఉంటుంది. కొత్తది కొనుక్కోవడం తప్పించి ఇంకేం చేయలేం. జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తాం.. అవన్నీ కుదరకపోతే దానికి నీళ్లు వదులుకోవాల్సిందే. మరి.. ఫోన్ ను ఎక్కడైనా పెట్టి మరిచిపోతే. ఇంట్లోనో బయట ఫంక్షన్ లోనూ.. ఇంకా వేరే వాళ్ల ఇంట్లో దాన్ని సైలెంట్ లో పెట్టి మరిచిపోతే.. అప్పుడు ఏంటి పరిస్థితి.ఫోన్ సైలెంట్ లో ఉంటే మన పక్కనే ఉన్నా కూడా మనం ఫోన్ ను కనిపెట్టలేం. అటువంటి సమయాల్లో ఈ చిన్న చిట్కాను ఫాలో అయితే చాలు. ఫోన్ ను క్షణాల్లో కనుక్కోవచ్చు. దాని కోసం మీరు చేయాల్సింది ఏంటంటే.. స్మార్ట్ ఫోన్ ను కొనగానే.. దాన్ని మీ జీమెయిల్ తో లాగిన్ అయి ఉంచాలి. తర్వాత జీపీఎస్ ను ఎప్పటికీ ఆన్ లో ఉంచాలి.
Smart Phone : దాని కోసమే ఈ చిన్న ట్రిక్
ఒకవేళ మీ ఫోన్ మిస్ అయినట్టు అనిపిస్తే.. వెంటనే వేరే ఫోన్ నుంచి కానీ.. సిస్టమ్ నుంచి కానీ.. గూగుల్ లో ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ అని టైప్ చేయండి. అప్పుడు గూగుల్ ఫైండ్ మై డివైజ్ వెబ్ సైట్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఫోన్ లో ఏ జీమెయిల్ తో లాగిన్ అయ్యారో అదే మెయిల్ తో లాగిన్ అవ్వండి. అప్పుడు మీ పోన్ ఎక్కడుందో లొకేషన్ ను చూపిస్తుంది. అంతే కాదు.. మీ ఫోన్ చార్జింగ్ ఎంత ఉంది.. కూడా కనిపిస్తుంది. దాని కిందే.. మీ ఫోన్ సైలెంట్ లో ఉన్నా కూడా ఫోన్ చేసే సదుపాయం ఉంటుంది. ప్లే సౌండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. వెంటనే మీ ఫోన్ మోగుతుంది. దాని కింద.. సెక్యూర్ డివైస్, ఎరేస్ డివైస్ అనే ఆప్షన్లు కూడా ఉంటాయి. ఒకవేళ మీ ఫోన్ ను ఎవరైనా దొంగలిస్తే.. ఆ ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ చేయాలంటే.. మీ పోన్ ఖచ్చితంగా ఆన్ లో ఉండాలి.