Smart Phone | Oppo A6 5G లాంచ్ ..7,000mAh బ్యాటరీతో, ధర రూ.20,000 నుంచి
Smart Phone | చైనాలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Oppo, తన మిడ్‌రేంజ్ 5G సెగ్మెంట్‌లో కొత్త మోడల్ Oppo A6 5G ని మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. పటిష్టమైన స్పెసిఫికేషన్లు, ఆకట్టుకునే డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో అమ్మకాలకు సిద్ధంగా ఉంది. ఒప్పో ఈ ఫోన్‌కు 7,000mAh భారీ బ్యాటరీను అందించింది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేయడం విశేషం. దీని వల్ల వన్ ఛార్జ్‌తో చాలా రోజులు బ్యాకప్ ఇవ్వనుంది.

#image_title
డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
Oppo A6 5G, ఆక్టా-కోర్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది వేగవంతమైన పనితీరు కోసం రూపొందించబడిన చిప్‌సెట్. ఫోన్‌లో స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించుకునే అవకాశముంది.
డిస్‌ప్లే & డిజైన్
6.57-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే
120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
240Hz టచ్ శాంప్లింగ్ రేట్
1,400 nits బ్రైట్‌నెస్
ఈ ఫీచర్లు గేమింగ్, మల్టీమీడియా వినియోగదారులకు మంచి విజువల్ అనుభూతిని అందించనున్నాయి.
కెమెరా సెటప్
డ్యూయల్ రియర్ కెమెరా:
50MP వైడ్-అంగిల్ ప్రైమరీ లెన్స్ (Auto Focusతో)
2MP మోనోక్రోమ్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా:
16MP సెల్ఫీ కెమెరా
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం మెరుగైన కెమెరా మాడ్యూల్‌తో డిజైన్ చేయబడింది.
ఇతర కీలక ఫీచర్లు
ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
5G, 4G, GPS, బీడౌ వంటి కనెక్టివిటీ ఆప్షన్‌లు
యాంబియంట్ లైట్ సెన్సార్, ఎక్స్ిలెరోమీటర్, ఇ-కంపాస్ వంటి సెన్సర్లు
ధరలు & వేరియంట్లు
Oppo A6 5G చైనాలో మూడు వేరియంట్లలో లాంచ్ అయింది:
8GB RAM + 256GB స్టోరేజ్ – ₹20,000 (సుమారుగా)
12GB RAM + 256GB స్టోరేజ్
12GB RAM + 512GB స్టోరేజ్
ఈ ఫోన్ బ్లూ, పింక్, గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ప్రస్తుతం Oppo చైనా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంది.ఇంతటి పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లతో Oppo A6 5G మోడల్ త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా రానుందని తెలుస్తుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.