Ulavala Rasam : నోరూరించే ఉలవల రసం…. ఇలా చేశారంటే రెస్టారెంట్లు కూడా పనికిరావు..!
Ulavala Rasam : రసం… ఇది లేకుండా భోజనమే పూర్తి కాదు. అయితే ఈ రసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. అయితే ఎక్కడ ఎలా చేసినా రసం టేస్టే వేరు. అయితే అన్ని రసాల్లో కెల్లా ఉలవస రసం అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ రసాన్ని మరింత రుచిగా ఉండాలంటే ఈ స్టైల్లో చేసుకోండి. ఉడిపి-మంగళూరు రీజియన్ లో ఈ రసం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రసం చాలా స్పైసీగా ఉంటుంది. ఇందులో తాజా ఉలవలు, వెల్లుల్లి పేస్టును వాడతారు. ఐరన్ లోపంతో బాధడేవారు ఉలవచారును తినడం చాలా మంచిది. రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయేజనాలను చేకూర్చు ఉలవచారు రసం ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం…
కావాల్సిన పదార్థాలు.. కప్పు ఉలవలు, కప్పు నీళ్లు, సగం కప్పు తురిమిన కొబ్బరి, 4 వెల్లల్లి రెబ్బలు, ఆప్ టేబుల్ స్పూన్ అవాలు, టేబుల్ స్పూన్ రసం పొడి, సరిపపోయేంత నూనె, ఉప్పు, టీ స్పూన్ బెల్లం, 2 టేబుల్ స్పూన్ల చింత పండు, కప్పు కొత్తి మీర.తయారీ విధానం.. ప్రెషర్ కుక్కర్ లో ఉలవలు మరియు నీళ్లు పోసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు వాటిని ఉడికింాలి. ఉలవచారు రెసిపీని తయారు చేసుకోవడానికి మొదటగా ఉలవలను ఉడకబెట్టడం చాలా ముఖ్యం… ఎండు కొబ్బరి పొడి, ఉల్లిగడ్డ, ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవలను మక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మూడు పదార్థాల మిశ్రమం బాగా కలిసేంత వరకూ మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ ను పెట్టి వేడి చేయాలి. తర్వాత అందులో నూనె పోసి అది వేడయ్యాక ఆవాలు, ఇంగువ వేసుకోవాలి… తర్వాత అందులో రెండు గ్లాసుల నీటిని పోసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవలను వేసి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇది బాగా మరిగాక రసం పొడిని కలుపుకోవాలి. చిందపండు రసం కూడా కావాల్సినంత వేసుకోవాలి. కాస్త తియ్యగా కావాలనుకునే వాళ్లు బెల్లాన్ని కూడా కలుపుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే ఉలవచారు రసం రెడీ. రసాన్ని దింపేసే ముందు కొత్తిమీర వేసుకొని దింపేయాలి.