aadhar card : యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అందించే 12 అంకెల ఆధార్ నంబర్ ప్రతి ఒక్కరికీ అవసరం. భారత పౌరులు తప్పనిసరిగా ఆధార్‌ను పొందాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌లుగా ఉపయోగించుకోవచ్చు. అయితే అప్పుడే పుట్టిన చిన్నారులకు ఆధార్ కార్డును పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు బయో మెట్రిక్స్ అవసరం లేకుండానే ఆధార్ ఇస్తారు. అంటే వేలి ముద్రలు, ఐరిస్ స్వీకరించరు. కానీ వారికి 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటినప్పుడు రెండు సార్లు బయోమెట్రిక్ ను అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. ఇక పెద్దలకు తీసుకున్నట్లే చిన్నారులకు కూడా ఆధార్‌ను తీసుకోవచ్చు. అందుకు ప్రత్యేకమైన పద్ధతులు ఏమీ ఉండవు. కాకపోతే చిన్నారులకు ఆధార్‌ను పొందే సమయంలో ఆధార్ కేంద్రంలో వారి వెంట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. అలాగే వారి జనన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలి.
చిన్నారులకు ఆధార్ పొందేందుకు ఆన్‌లైన్‌లో ముందుగా దరఖాస్తు చేసుకుని దానికి సంబంధించిన ఎన్ రోల్ మెంట్ నంబర్, పత్రాలను తీసుకుని ఆధార్ కేంద్రానికి వెళితే అక్కడ పూర్తిస్థాయిలో ఆధార్ కార్డును ఇస్తారు.
* యూఐడీఏఐ వెబ్‌సైట్ ను ముందుగా సందర్శించాలి.
* ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
* చిన్నారి పేరు, పెద్దల ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా వివరాలను నమోదు చేయాలి.
* చిరునామాలో స్థానిక ప్రదేశం, జిల్లా, రాష్ట్రం వివరాలను తెలపాల్సి ఉంటుంది.
* అపాయింట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేసి అందులో ముందుగానే ఆధార్ కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
* దరఖాస్తుదారులు తమకు సమీపంలో ఉన్న, అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న ఆధార్ కేంద్రానికి వెళ్లి చిన్నారులను, వారి బర్త్ సర్టిఫికెట్‌ను చూపించి ఆధార్‌ను పొందవచ్చు. చిన్నారుల ఆధార్ నంబర్ వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్‌తో లింక్ అవుతుంది.
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.