BJP : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి మరియు ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ మొత్తం అయిదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కవ మంది దృష్టిని ఆకర్షిస్తున్నవి మాత్రం పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా బెంగాల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఏడాది కాలంగానే అక్కడ పావులు కదుపుతూ మమత బెనర్జీని ఇబ్బందికి గురి చేసేలా మోడీ మరియు అమిత్ షా లు వ్యవహరిస్తూ వచ్చారు. ఆమద్య మమత బెనర్జీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వే ను ప్రముఖ సంస్థలు అయిన సీ ఓటర్ మరియు ఏబీపీలు నిర్వహించాయి.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రభావం కాస్త పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాని ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో మాత్రం బీజేపీ అక్కడ లేదు అంటూ సర్వే తేల్చి చెప్పింది. అక్కడ మమతను గద్దె దించాలని బీజేపీ వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు అంటున్నారు. మరో సారి కూడా మమత బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా సర్వే ఫలితం బలంగా చెబుతుంది. ఈ సమయంలో బీజేపీ ఏం చేయబోతుంది అనేది ఆసక్తిగా మారింది. గంగూలీని దించి చివరి నిమిషంలో వ్యూహాలు మార్చితే ఫలితాలు తారు మారు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో ఇప్పటికే వరకు బీజేపీకి గౌరవ ప్రథమైన సీట్లు వచ్చిన సందర్బం లేదు. అలాంటి తమిళ నాట అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేయాలని ఉవ్విల్లూరుతోంది. తమిళనాట ఉన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో మోడీ పావులు కదిపి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. కాని అక్కడ కూడా బీజేపీ పాచిక పారడం లేదు అంటూ సర్వే ఫలితం వచ్చింది. డీఎంకే కూటమి అక్కడ ప్రభుత్వంను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సంస్థ క్లారిటీగా ప్రకటించింది. ఇక బీజేపీ అక్కడ మళ్లీ సింగిల్ డిజిట్ స్థానాలు అయినా సంపాదిస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట కమల్ పార్టీ ప్రభావం ఎంత అంటే చాలా తక్కువ అంటూ సర్వే ఫలితం చెబుతోంది.
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్లో ఒక సంవత్సరం అప్రెంటీస్షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
This website uses cookies.