ys jagan : మంత్రుల పనితీరు సరిగ్గా లేకపోతే రెండున్నర ఏళ్ల తర్వాత పదవి నుండి తప్పించటం ఖాయమని ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో చెప్పిన మాటలు. ఇప్పుడు ఆ సమయం దగ్గరపడినట్లు సృష్టంగా తెలుస్తుంది. మంత్రులపై ఆయన ఓ కన్నేసి ఉంచుతున్నారు. మంత్రుల బాడీ లాంగ్వేజ్ నుంచి వారి మాట తీరు వ్యవహారాల వరకు సీఎం అన్ని కోణాల్లో కొందరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ఇక జగన్ తన మంత్రి వర్గం నుండి తప్పించే మంత్రుల జాబితాలో మొదటి పేరు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు పేరు ఉన్నట్లు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఆలయాలపై దాడులతో ప్రభుత్వం ఇరుకున పడింది. అయితే.. దీని నుంచి బయటపడేందుకు అంతే వేగంగా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి పనితీరుపై సీఎం సంతృపితో లేదని, ఈ వివాదంలో టీడీపీకి గట్టిగా సమాధానం చెప్పే విషయంలో మంత్రి సరిగ్గా వ్యవహరించలేదని, మీడియా ముందు కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేదని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
నిజానికి వెల్లంపల్లి శ్రీనివాసు సీఎం జగన్ కు బాగా సన్నిహితమని వైసీపీ వర్గాలే చెపుతున్నాయి. అయినా కానీ ఈ విషయంలో జగన్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అనేక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దేవాలయాల మీద జరిగిన దాడుల విషయంలోనే కాకుండా, మంత్రి తన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వం పనులు అప్పగించడం పైనా జగన్ ఆరాతీసినట్టు తెలిసింది.
ఇది కూడా చదవండి ==> Ramoji Rao : షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామోజీ రావు.. ?
మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కీలకమైన విజయవాడ మేయర్ స్థానాన్ని ఎలాగైనా వైసీపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. దీనితో ఆ బాధ్యత విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, మంత్రి పదవి అనుభవిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసు మీద ఎక్కువగా ఉంది. అయితే ఆయన మంత్రి అయిన తర్వాత తన కుల వర్గమైన ఆర్యవైశ్యులు విషయంలో పెద్దగా చేసింది ఏమి లేదని విజయవాడ లోని అయన వర్గం అసంతృప్తితో ఉండనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ దశలో అక్కడ తన వర్గాన్ని తన వైపు తిప్పుకొని విజయవాడ మేయర్ సీటు కైవసం చేసుకోవటం వెల్లంపల్లి తక్షణ కర్తవ్యం.. ఇక్కడ ఏమైనా తేడా జరిగితే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం ఆయన మంత్రి పదవి మీద పడే అవకాశం ఉందని అంటున్నారు వైసీపీ నేతలు
ఇది కూడా చదవండి ==> YS Jagan : ఢిల్లీకి సీఎం జగన్.. దానిపై తాడో పేడో తేల్చుకోవడానికేనా?
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.