Bus | బస్సులో భారీ మార్పులు.. ఒక్కడి ప్రశ్నకి అంతా చేంజ్..
Bus | “మార్పు ఒక్కరిచేత మొదలవుతుంది” అన్న మాటకు ఇదే నిదర్శనం. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తాను వేసిన ప్రశ్న ద్వారా RTC వ్యవస్థలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికాడు. సామాన్యులు సీటు బెల్ట్ ధరించకపోతే జరిమానాలు విధించే అధికారులు, RTC బస్సుల్లో డ్రైవర్లే సీటు బెల్ట్‌లు ధరించకపోవడంపై ప్రశ్నించడమే దీనికి నాంది అయ్యింది.
#image_title
ఈ వ్యక్తి సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఆర్టీసీని ప్రశ్నిస్తూ..
బస్సుల్లో డ్రైవర్ల సీట్లకు సీటు బెల్ట్‌లు ఉన్నాయా?
అవి ఉపయోగంలో ఉన్నాయా?
డ్రైవర్లు బెల్ట్‌లు పెట్టకపోతే కేసులు నమోదయ్యాయా?
జరిమానాలు వసూలయ్యాయా? అనే వివరాలను కోరారు.
ఈ ప్రశ్నల ద్వారా RTC అధికార యంత్రాంగమే నిబంధనలు పాటించడం లేదని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో RTC ఉన్నతాధికారులు స్పందించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో డ్రైవర్ సీటు బెల్ట్‌లు తప్పనిసరిగా వినియోగించేలా డిపో మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇకపై RTC బస్సుల్లో ఏవరికైనా తప్పనిసరిగా సీటు బెల్ట్!
డ్రైవర్‌తోపాటు, ముందువైపు సింగిల్ సీటులో కూర్చునే ప్రయాణికులకు కూడా సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి.అన్ని డిపోలలో యుద్ధప్రాతిపదికన డ్రైవర్ల సీట్లకు, ముందువైపు ప్రయాణికుల సీట్లకు బెల్టులు అమర్చుతున్నారు. డ్రైవర్లకు ‘గేట్ మీటింగ్’ల ద్వారా సీటు బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.