
Restaurant : రెస్టారెంట్‌లో ఫ్రీగా వాటర్ ఇవ్వకపోతే భారీ ఫైన్.. మీరు ఇలా చేయండి...!
Restaurant : నీళ్లు కొనుక్కోవల్సిన పరిస్థితి వస్తుందని అప్పట్లో చెబితే ఎవరు నమ్మలేదు. కాని ఇప్పుడు కనులారా చూస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా నీటి సమస్యతో అల్లాడిపోతున్నారు.నీళ్లలో తేడా వస్తే లేనిపోని అనారోగ్యాలని చవి చూడాల్సి వస్తుందని ఇప్పుడు చాలా మంది మినరల్ వాటర్‌ని కొనుక్కుంటున్నారు. ఇక రెస్టారెంట్స్, హోటల్స్ వంటి వాటిలో రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. రెస్టారెంట్స్ కి భోజనం చేసేందుకు వెళ్లే కస్టమర్స్‌కి ఫ్రీగా లూస్ వాటర్ ఇవ్వకుండా బాటిల్స్ అందిస్తూ సరికొత్త దందాకి తెరలేపుతున్నారు. ఈ క్రమంలో జిల్లా వినియోగదారుల కమీషన్ ఓ హోటల్‌కి మాత్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వేలల్లో ఫైన్ వేయడంతో వారు నెత్తి నోరు బాదకుంటున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
తెలంగాణ గవర్నమెంట్ మున్పిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ 2023 నుండి అన్ని హోటల్స్ ,రెస్టారెంట్స్‌లో కస్టమర్స్‌కి ఉచితంగా వాటర్ ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చింది. అయితే కొన్ని రెస్టారెంట్స్ వీటిని ఫాలో కావడం లేదు. హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ వారు తాజాగా ఆఫ్ లీటర్ వాటర్ కు రూ.50 ఛార్జ్ చేసారు. దీనికి ఓ కస్టమర్ డిస్ట్రిక్ కన్సూమర్స్ కమిషన్ కు ఆశ్రయించాడు. ఆ హాటల్ కస్టమర్‌కు రూ.5వేల చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. దీంతో అతడు ఏం చేయలేక ఫైన్ పే చేయాల్సి వచ్చింది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ రెస్టారెంట్ కు భోజనం చేసేందుకు వెళ్లగా, అక్కడ తనకు బాటిల్ వాటర్ కాకుండా టూస్ వాటర్ ఇవ్వాలని అడిగాడు.
Restaurant : రెస్టారెంట్‌లో ఫ్రీగా వాటర్ ఇవ్వకపోతే భారీ ఫైన్.. మీరు ఇలా చేయండి…!
అయితే రెస్టారెంట్ సిబ్బంది 500 ఎంఎల్ వాటర్ బాటిల్ ఇచ్చి రూ.50 ఛార్జ్ చేశారు. రెస్టారెంట్ తీరుతో కొంత ఆశ్చర్యపోయిన అతను వెంటనే కస్టమర్ కన్సూమర్ కమిషన్‌లో కంప్లైంట్ చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్ కస్టమర్‌కు కలిగిన నష్టానికి రూ.5వేలు చెల్లించాలని, లిటిగేషన్ ఫీజు రూ.వేయి కట్టాలని ఆదేశించింది. అంతేకాదు వాటర్ బాటిల్ కు తీసుకున్న రూ.50.. కస్టమర్ కు తిరిగి ఇవ్వాలని జిల్లా వినియోగదారుల కమిషన్ రెస్టారెంట్‌కి ఆదేశాలు జారీ చేసింది. మనలో కూడా చాలా మందికి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సమయంలో వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించి నష్టపరిహారాన్ని పొందొచ్చు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.