Restaurant : రెస్టారెంట్‌లో ఫ్రీగా వాట‌ర్ ఇవ్వ‌క‌పోతే భారీ ఫైన్.. మీరు ఇలా చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Restaurant : రెస్టారెంట్‌లో ఫ్రీగా వాట‌ర్ ఇవ్వ‌క‌పోతే భారీ ఫైన్.. మీరు ఇలా చేయండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :9 April 2024,7:00 pm

Restaurant : నీళ్లు కొనుక్కోవ‌ల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అప్ప‌ట్లో చెబితే ఎవ‌రు న‌మ్మ‌లేదు. కాని ఇప్పుడు కనులారా చూస్తున్నాం. ప్ర‌పంచ వ్యాప్తంగా నీటి స‌మ‌స్య‌తో అల్లాడిపోతున్నారు.నీళ్ల‌లో తేడా వస్తే లేనిపోని అనారోగ్యాల‌ని చ‌వి చూడాల్సి వ‌స్తుంద‌ని ఇప్పుడు చాలా మంది మిన‌ర‌ల్ వాట‌ర్‌ని కొనుక్కుంటున్నారు. ఇక రెస్టారెంట్స్‌, హోట‌ల్స్ వంటి వాటిలో రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. రెస్టారెంట్స్ కి భోజ‌నం చేసేందుకు వెళ్లే క‌స్ట‌మర్స్‌కి ఫ్రీగా లూస్ వాట‌ర్ ఇవ్వ‌కుండా బాటిల్స్ అందిస్తూ స‌రికొత్త దందాకి తెర‌లేపుతున్నారు. ఈ క్ర‌మంలో జిల్లా వినియోగ‌దారుల క‌మీష‌న్ ఓ హోట‌ల్‌కి మాత్రం దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. వేల‌ల్లో ఫైన్ వేయడంతో వారు నెత్తి నోరు బాద‌కుంటున్నారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

Restaurant : రూ.50 కోసం చూస్తే రూ.5000 ఫైన్

తెలంగాణ గవర్నమెంట్ మున్పిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ 2023 నుండి అన్ని హోట‌ల్స్ ,రెస్టారెంట్స్‌లో క‌స్ట‌మ‌ర్స్‌కి ఉచితంగా వాట‌ర్ ఇవ్వాల‌నే నిబంధ‌న తీసుకొచ్చింది. అయితే కొన్ని రెస్టారెంట్స్ వీటిని ఫాలో కావ‌డం లేదు. హైద‌రాబాద్‌లోని ఓ రెస్టారెంట్ వారు తాజాగా ఆఫ్ లీటర్ వాటర్ కు రూ.50 ఛార్జ్ చేసారు. దీనికి ఓ కస్టమర్ డిస్ట్రిక్ కన్సూమర్స్ కమిషన్ కు ఆశ్రయించాడు. ఆ హాటల్ కస్టమర్‌కు రూ.5వేల చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. దీంతో అత‌డు ఏం చేయ‌లేక ఫైన్ పే చేయాల్సి వ‌చ్చింది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ రెస్టారెంట్ కు భోజనం చేసేందుకు వెళ్ల‌గా, అక్క‌డ త‌న‌కు బాటిల్ వాట‌ర్ కాకుండా టూస్ వాట‌ర్ ఇవ్వాల‌ని అడిగాడు.

Restaurant రెస్టారెంట్‌లో ఫ్రీగా వాట‌ర్ ఇవ్వ‌క‌పోతే భారీ ఫైన్ మీరు ఇలా చేయండి

Restaurant : రెస్టారెంట్‌లో ఫ్రీగా వాట‌ర్ ఇవ్వ‌క‌పోతే భారీ ఫైన్.. మీరు ఇలా చేయండి…!

అయితే రెస్టారెంట్ సిబ్బంది 500 ఎంఎల్ వాటర్ బాటిల్ ఇచ్చి రూ.50 ఛార్జ్ చేశారు. రెస్టారెంట్ తీరుతో కొంత ఆశ్చ‌ర్య‌పోయిన అత‌ను వెంట‌నే కస్టమర్ కన్సూమర్ కమిషన్‌లో కంప్లైంట్ చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్ కస్టమర్‌కు కలిగిన నష్టానికి రూ.5వేలు చెల్లించాలని, లిటిగేషన్ ఫీజు రూ.వేయి కట్టాలని ఆదేశించింది. అంతేకాదు వాట‌ర్ బాటిల్ కు తీసుకున్న రూ.50.. కస్టమర్ కు తిరిగి ఇవ్వాలని జిల్లా వినియోగదారుల కమిషన్ రెస్టారెంట్‌కి ఆదేశాలు జారీ చేసింది. మ‌న‌లో కూడా చాలా మందికి ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. ఆ స‌మ‌యంలో వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించి నష్టపరిహారాన్ని పొందొచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది