Car Accident : ఈరోజుల్లో బయటికి వెళ్తే.. మళ్లీ ఇంటికి తిరిగి వస్తామా? అనే అనుమానం ఉంటోంది. దానికి కారణం… బయట తిరిగే వాహనాలు. చాలా నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తూ ఎదుటి వాళ్లను యాక్సిడెంట్ కు గురి చేస్తూ ప్రాణాలనే తీసేస్తున్నారు కొందరు. ఒక్కరు చేసే తప్పు.. పది మందికి శిక్ష పడేలా చేస్తోంది. రోజూ మనం ఎన్నో రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం. కొన్ని ప్రమాదాలు.. స్పీడ్ వల్ల.. తెలియక.. తొందరపాటు వల్ల జరిగితే.. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మాత్రం నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయి.
యాక్సిడెంట్ వల్ల రోజూ వందల మంది చనిపోతున్నారు. అయినా కూడా వాహనాలను నడిపే వాళ్లు జాగ్రత్త పాటించడం లేదు. ఇటీవల హైదరాబాద్ లో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని మాదాపూర్ దగ్గర ఓ కారు అతి వేగంగా వెళ్తూ.. పక్కనుంచి వెళ్తున్న ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో.. చాలా ఫల్టీలు కొట్టి.. రోడ్డు డివైడర్ ను తాకి పక్కన పడి.. నుజ్జునుజ్జు అయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కూడా చనిపోయాడు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ యాక్సిడెంట్ అక్కడే ఉన్న 3 సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఒక ఆడీ కారు అతి వేగంగా వెళ్తూ.. ఆటోను ఢీకొట్టి.. అలాగే ఆగకుండా వెళ్లిపోయింది. మద్యం తాగి కారును అతి వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఆడీ కారు నడిపిన డ్రైవర్, కారులో ఉన్న వాళ్ల మీద కేసు నమోదు చేసి.. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని… అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఆ యాక్సిడెంట్ వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ యాక్సిడెంట్ వీడియోను మీరు కూడా చూడండి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.