Car Accident : సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన ఈ యాక్సిడెంట్ వీడియో చూస్తే దడుసుకుంటారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Car Accident : సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన ఈ యాక్సిడెంట్ వీడియో చూస్తే దడుసుకుంటారు?

Car Accident : ఈరోజుల్లో బయటికి వెళ్తే.. మళ్లీ ఇంటికి తిరిగి వస్తామా? అనే అనుమానం ఉంటోంది. దానికి కారణం… బయట తిరిగే వాహనాలు. చాలా నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తూ ఎదుటి వాళ్లను యాక్సిడెంట్ కు గురి చేస్తూ ప్రాణాలనే తీసేస్తున్నారు కొందరు. ఒక్కరు చేసే తప్పు.. పది మందికి శిక్ష పడేలా చేస్తోంది. రోజూ మనం ఎన్నో రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం. కొన్ని ప్రమాదాలు.. స్పీడ్ వల్ల.. తెలియక.. తొందరపాటు వల్ల జరిగితే.. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :29 June 2021,2:52 pm

Car Accident : ఈరోజుల్లో బయటికి వెళ్తే.. మళ్లీ ఇంటికి తిరిగి వస్తామా? అనే అనుమానం ఉంటోంది. దానికి కారణం… బయట తిరిగే వాహనాలు. చాలా నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తూ ఎదుటి వాళ్లను యాక్సిడెంట్ కు గురి చేస్తూ ప్రాణాలనే తీసేస్తున్నారు కొందరు. ఒక్కరు చేసే తప్పు.. పది మందికి శిక్ష పడేలా చేస్తోంది. రోజూ మనం ఎన్నో రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం. కొన్ని ప్రమాదాలు.. స్పీడ్ వల్ల.. తెలియక.. తొందరపాటు వల్ల జరిగితే.. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మాత్రం నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయి.

hyderabad accident video released by cyberabad traffic police

hyderabad accident video released by cyberabad traffic police

యాక్సిడెంట్ వల్ల రోజూ వందల మంది చనిపోతున్నారు. అయినా కూడా వాహనాలను నడిపే వాళ్లు జాగ్రత్త పాటించడం లేదు. ఇటీవల హైదరాబాద్ లో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని మాదాపూర్ దగ్గర ఓ కారు అతి వేగంగా వెళ్తూ.. పక్కనుంచి వెళ్తున్న ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో.. చాలా ఫల్టీలు కొట్టి.. రోడ్డు డివైడర్ ను తాకి పక్కన పడి.. నుజ్జునుజ్జు అయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కూడా చనిపోయాడు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

Car Accident :  3 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన యాక్సిడెంట్

ఈ యాక్సిడెంట్ అక్కడే ఉన్న 3 సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఒక ఆడీ కారు అతి వేగంగా వెళ్తూ.. ఆటోను ఢీకొట్టి.. అలాగే ఆగకుండా వెళ్లిపోయింది. మద్యం తాగి కారును అతి వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఆడీ కారు నడిపిన డ్రైవర్, కారులో ఉన్న వాళ్ల మీద కేసు నమోదు చేసి.. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని… అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఆ యాక్సిడెంట్ వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ యాక్సిడెంట్ వీడియోను మీరు కూడా చూడండి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది