
hyper aadi to contest in next elections from janasena
Hyper Aadi : ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. త్వరలో అంటే వచ్చే సంవత్సరం ఎండాకాలం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు కోసం ప్లాన్స్ చేస్తున్నాయి. రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే.. ఇందులో టీడీపీ ఎన్ని సీట్లు, జనసేన ఎన్ని సీట్లు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే.. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి అవకాశం ఇస్తారు అనేదానిపై కూడా క్లారిటీ లేదు. కాకపోతే జనసేన పార్టీ నుంచి పోటీ చేసే వాళ్లలో పలువురు పొలిటికల్, సినీ ప్రముఖులు ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్ సభలో జబర్దస్త్ హైపర్ ఆది మాట్లాడి…
మంత్రి రోజా, పలువురు వైసీపీ నేతలపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైపర్ ఆది పేరు ఏపీ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. హైపర్ ఆది అంతగా జనసేనకు భజన ఎందుకు చేస్తున్నాడు. అసెంబ్లీ సీటు ఆశిస్తున్నాడా? ప్రత్యక్షంగా రాజకీయాల్లో హైపర్ ఆది లేనప్పటికీ.. పవర్ స్టార్ అభిమానిగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. పలు పవన్ సభలలో మాట్లాడుతున్నాడు. అందరి అటెన్షన్ ను క్యాష్ చేసుకుంటున్నాడు. జబర్దస్త్ స్టేజ్ మీద వేసే పంచులకు అందరూ చప్పట్లు కొడతారు. మరి.. ఆ పంచులు రాజకీయాల్లో పని చేస్తాయా? అనేదే పెద్ద ప్రశ్న. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన యువశక్తి సభలో హైపర్ ఆది ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసు.
hyper aadi to contest in next elections from janasena
పవన్ పై తనకు ఉన్న విధేయతను చాటుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాడా? ఆది గురించి పవన్ కూడా ప్రస్తావించడం విశేషం. సినిమాల్లో, రాజకీయాల్లో ఇలా పలు సందర్బాల్లో పవన్ కు మద్దతు ఇస్తున్న ఆదికి వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి టికెట్ ఇస్తారా? అని అంతా అనుకుంటున్నారు. తన సొంత జిల్లా ప్రకాశం నుంచి జనసేన అభ్యర్థిగా హైపర్ ఆది పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గిద్దలూరు, దర్శి.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి జనసేన తరుపున ఆదికి పవన్ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు జబర్దస్త్ మానేసి మరీ హైపర్ ఆది పవన్ వెంట తిరుగుతున్నాడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం మరి .. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.