Dating : ఈ లక్షణాలు అమ్మాయిల్లో ఉంటే..అబ్బాయి కనిపిస్తే అస్సలు వదలరు
Dating Girls : కొంతమంది అమ్మాయిలను చూస్తే వారిలో ప్రత్యేకమైన ధైర్యం, ఆట్టిట్యూడ్ కనిపిస్తాయి. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న తర్వాత మాత్రమే ఆ స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా రిలేషన్‌షిప్ అనుభవాలు వారికి నిజాయితీగా ఉండటం, స్పష్టంగా ఆలోచించడం, ప్రేమను ఓపెన్‌గా వ్యక్తపరచడం వంటి పాఠాలను నేర్పుతాయి. ప్రేమ విషయమై వారు మొహమాటం లేకుండా మాట్లాడగలరు. సిగ్గు, బిడియం లేకుండా అబ్బాయిలతో సహజంగా మెలగగలరు.

#image_title
అలాంటి అమ్మాయిలకు అనవసర అంచనాలు ఉండవు. సినిమాల్లో చూపించే కల్పిత ప్రేమకథల కంటే నిజాయితీతో కూడిన సంబంధం కావాలని కోరుకుంటారు. వారు ఎమోషనల్ డ్రామాకు లొంగరు. సమస్యలు వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొంటారు. గత అనుభవాలు వారికి సెల్ఫ్-రెస్పెక్ట్, పర్సనల్ స్పేస్ విలువను బోధించాయి. ఫేక్ కాంప్లిమెంట్స్ లేదా చౌకబారు పొగడ్తలు వారిని ఆకట్టవు. ఎదుటివారిలో నిజమైన ప్రయత్నం, కట్టుబాటు ఉన్నప్పుడే వారిని నమ్ముతారు.
ఇలాంటి మహిళలు డీల్-బ్రేకర్స్ విషయంలో స్పష్టత కలిగి ఉంటారు. తప్పు అనిపిస్తే ఆలస్యం చేయకుండా సంబంధం నుంచి బయటకు రావడానికి వెనకాడరు. గుడ్‌బై చెప్పడంలో భయం ఉండదు, ఎందుకంటే అన్ని సంబంధాలు జీవితాంతం ఉండవనే వాస్తవాన్ని వారు అంగీకరించారు. సెల్ఫ్-వాలిడేషన్ కోసం ఎదుటివారి అప్రూవల్ కోసం ఎదురుచూడరు. తాము ఏం కావాలో సూటిగా చెబుతారు. ఇతరుల అటెన్షన్ కోసం ప్రయత్నించకుండా, తన స్టైల్‌లో రెడీ అయి, తన విలువను తనలోనే వెతుక్కుంటారు. ఇవన్నీ ఆమెకు ఉన్న అనుభవజ్ఞత, పరిపక్వతను స్పష్టంగా తెలియజేస్తాయి.