Nimmagadda Ramesh : ఏపీలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితి పాపం పగ వాడికి కూడా రాకూడదు, వచ్చే నెలలో వారి పరిస్థితి ఏంటో?
Nimmagadda Ramesh : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగి పోవడంతో పాటు నిన్న మొదటి దశ ఎన్నికలు కూడా పూర్తి అయ్యాయి. ఈ విషయంలో ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ పూర్తిగా వైకాపాపై ఘన విజయం సాధించినట్లు అయ్యింది. రాష్ట్రంలో వైకాపా ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయం అంటూ మొదటి నుండి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే వైకాపా ను నిమ్మగడ్డ రమేష్ అనేక సార్లు చిత్తు చేశాడు అనేది ఇక్కడ అందరు గుర్తించాల్సిన విషయం. ఈ సమయంలోనే వైకాపాను మరింతగా ఇరుకున పెట్టేందుకు నిమ్మగడ్డ రమేష్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు కొన్ని సార్లు వైఎస్ జగన్ ప్రభుత్వంకు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగాల కోసం వారు ప్రభుత్వంకు వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తుంది.

In Andhra pradesh the government employees facing very critical situation between YS Jagan and Nimmagadda Ramesh
ఒత్తిడితో నలిగి పోతున్న అధికారులు..
ఒక వైపు ఎన్నికల విధుల్లో ఏమాత్రం తప్పు దొర్లినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాను అంటూ నిమ్మగడ్డ రమేష్ అధికారులను హెచ్చరిస్తున్నాడు. జిల్లా జిల్లాకు సంబంధించిన ప్రతి రోజు రిపోర్ట్ ను నిమ్మగడ్డ రమేష్ తెప్పించుకుని చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అధికారులు కాస్త సీరియస్ గా ఉంటే వైకాపా నాయకుల నుండి ఒత్తిడి కనిపిస్తుంది. ప్రస్తుతంకు నిమ్మగడ్డ రమేష్ మాటే వినాలి కనుక తప్పనిసరి పరిస్థితుల్లో వైకాపా వారి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. దాంతో అది వారు మనసులో పెట్టుకుని ఎన్నికలు పూర్తి అవ్వనివ్వండి నీ సంగతి చెప్తా అన్నట్లుగా వార్నింగ్ లు ఇస్తున్నారట.
Nimmagadda Ramesh : మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలే నిదర్శణం..
నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలను అనుసరించి వైకాపా వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ముందు ముందు బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాం అంటూ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. అన్ని జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేసినా కూడా మంత్రులు తర్వాత ఏం చేస్తారో అనే ఆందోళన అధికారుల్లో ఉంది. అందుకే చాలా మంది అధికారులు ఈ ఒత్తిడి భరించలేక సెలవులు పెట్టి లేదా మరేదో అత్యవసరం అంటూ విధుల నుండి దూరంగా వెళ్తున్నారు. మరి కొందరు మాత్రం ఏం జరిగితే అదే జరిగింది అంటూ నిమ్మగడ్డకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. మొత్తానికి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా పంచాయితీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారుల పరిస్థితి పగ వాడికి రావద్దు అన్న రీతిలో ఉంది.