Ind Vs Aus : ఆసీస్ గ‌డ్డ‌పై ఆధిప‌త్యం చూపిస్తున్న భార‌త్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ind Vs Aus : ఆసీస్ గ‌డ్డ‌పై ఆధిప‌త్యం చూపిస్తున్న భార‌త్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం

 Authored By ramu | The Telugu News | Updated on :23 November 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Ind Vs Aus : ఆసీస్ గ‌డ్డ‌పై ఆధిప‌త్యం చూపిస్తున్న భార‌త్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం

Ind Vs Aus  1st Test Match : పెర్త్ వేదిక‌గా భార‌త్, ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భార‌త జ‌ట్టు 150 ప‌రుగుల‌కి ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 51.2 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా (5/30) అయిదు వికెట్లతో విజృంభించ‌గా, ఆయ‌న‌కి తోడుగా హర్షిత్ రాణా (3/48) మూడు, మహ్మద్ సిరాజ్ (2/20) రెండు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాని చాలా ఇబ్బంది పెట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ (26; 112 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్.స్టార్క్ మినహా అలెక్స్ కేరీ (21; 31 బంతుల్లో, 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (11; 13 బంతుల్లో, 2 ఫోర్లు), మెక్‌స్వీని (10; 13 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.

Ind Vs Aus ఆసీస్ గ‌డ్డ‌పై ఆధిప‌త్యం చూపిస్తున్న భార‌త్ 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం

Ind Vs Aus : ఆసీస్ గ‌డ్డ‌పై ఆధిప‌త్యం చూపిస్తున్న భార‌త్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం

Ind Vs Aus ఆసీస్‌కి ధీటుగా..

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగలు ఆధిక్యం లభించింది. అయితే 67/7 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా 100 పరుగుల మార్క్‌ను అందుకుందంటే అది స్టార్క్ పోరాటంతోనే. రెండో రోజు ఆటలో బుమ్రా తన తొలి బంతికే అలెక్స్ కేరీని పెవిలియన్‌కు చేర్చాడు బుమ్రా. ఆ తర్వాత వికెట్స్ వెంట‌వెంట‌నే ప‌డ‌గా, చిర‌వ‌లో స్టార్క్-హేజిల్‌వుడ్ కలిసి ఏకంగా 110 బంతులు ఎదుర్కొన్నారు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న భార‌త్ ధీటుగా ఆడ‌తుంది. తొలి ఇన్నింగ్స్‌లో డ‌కౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో 60 నాటౌట్‌గా ఉన్నారు.

ఇక కేఎల్ రాహుల్ వివాదాస్పద డీఆర్ఎస్ తో తన వికెట్‌ను కోల్పోయాడు. 26 పరుగులు చేసి వెనుదిరగాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఈ ఇద్దరు రెండోవ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లకు ఏమాత్రం భయపడుకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ 229 బంతుల్లోనే ఈ ఘనత సాధించారు. డౌన్‌అండర్‌లో తొలి వికెట్‌కు 100 పరుగుల మార్కును దాటిన ఆరో భారత జోడీగా వీరు రికార్డు సృష్టించారు. యశస్వి జైస్వాల్ తన అర్ధ సెంచరీని సాధించ‌గా, ఆరంభం నుంచి క్రీజులో ఎంతో సౌకర్యవంతంగా కనిపించిన రాహుల్ 4 ఫోర్లు బాది 50 పరుగులు చేశాడు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది