Pakistan : టీ20 వరల్డ్ కప్‌పై సస్పెన్స్.. భారత్-పాక్ మ్యాచ్ ఉందా?.. లేదా ?
ప్రధానాంశాలు:
pakistan : టీ20 వరల్డ్ కప్‌పై సస్పెన్స్..భారత్-పాక్ మ్యాచ్ ఉందా?.. లేదా ?
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం కూడా లేకపోయినా ఈ మెగా టోర్నీ చుట్టూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత ఉపఖండంలో క్రికెట్ కేవలం ఆటగా కాకుండా రాజకీయ భద్రతా అంశాలతో ముడిపడటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉపఖండ దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులను పాశ్చాత్య దేశాల జట్లు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ మొత్తం వివాదానికి నాంది పలికింది బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడమే. అక్కడి నుంచి మొదలైన పరిణామాలు ఇప్పుడు వరల్డ్ కప్‌లో భారత్–పాకిస్తాన్ మ్యాచ్ భవితవ్యానికే ప్రశ్నార్థకంగా మారాయి.
pakistan : టీ20 వరల్డ్ కప్‌పై సస్పెన్స్..భారత్-పాక్ మ్యాచ్ ఉందా?.. లేదా ?
pakistan : బంగ్లాదేశ్ నిర్ణయాలు..ఐసీసీ స్పందన
ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో జరిగే మ్యాచ్‌లలో పాల్గొనబోమని ప్రకటించడమే కాకుండా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై కూడా నిషేధం విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ ముందున్న మార్గం పరిమితమైంది. ఫలితంగా వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లండ్‌కు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. ఈ నిర్ణయం ఉపఖండ క్రికెట్ రాజకీయాలను మరింత సంక్లిష్టంగా మార్చింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ స్వరం కలపడం టోర్నీ బహిష్కరణ హెచ్చరికలు చేయడం ఈ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.
pakistan : పాకిస్తాన్‌కు లాభమా?..భారత్‌కు లాభమా?
తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమైన పీసీబీ చైర్మన్ నక్వీ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మొత్తం వరల్డ్ కప్‌ను బహిష్కరించాలా? లేక కేవలం భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మాత్రమే ఆడకుండా ఉండాలా? అన్న అంశంపై స్పష్టత రాలేదని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..పాకిస్తాన్ జట్టును ఇప్పటికే ప్రకటించినా టోర్నీలో పాల్గొనాలా వద్దా అన్న తుది నిర్ణయానికి మాత్రం ఈ శుక్రవారం లేదా సోమవారం వరకు గడువు పెట్టారు. పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ తరహాలో మొండికేస్తే ఐసీసీ మరో జట్టును టోర్నీలోకి తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తే ఆ మ్యాచ్ భారత్‌కు వాక్ ఓవర్‌గా మారి పాయింట్లు దక్కే అవకాశం ఉంది. అంటే ఈ మొత్తం వివాదంలో ప్రత్యక్షంగా లాభపడేది భారత్ కావచ్చు. మరోవైపు టోర్నీలో పాల్గొంటే బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపాలని పాకిస్తాన్ బోర్డు ఆలోచిస్తోంది. ఈ అన్ని అంశాలపై పూర్తి స్పష్టత రావాలంటే కనీసం ఈ నెల 30 వరకు వేచి చూడాల్సిందే. అప్పటివరకు టీ20 వరల్డ్ కప్‌కు ముందు క్రికెట్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తూనే ఉంటుంది.