India Post Office Jobs : ఈరోజుల్లో 10వ తరగతి పాసైతే ఏం ఉద్యోగాలు వస్తున్నాయి. ఏ ప్రైవేటు ఉద్యోగం కూడా రాదు. కానీ.. పది పాసైతే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే కొట్టేయొచ్చు. ఏం నమ్మకం లేదా.. పోస్టాఫీసులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియా పోస్ట్ జాబ్స్ అవి. జీతం కూడా 56 వేల రూపాయల వరకు వస్తుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం.. పే మెట్రిక్స్ లేవల్ 2 లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో స్టాఫ్ కారు డ్రైవర్ పోస్టుల కోసమే దరఖాస్తును ఇండియా పోస్ట్ కోరుతోంది. ఇండియా పోస్ట్ రిక్రూట్ మెంట్ ప్రకారం..
దీని కోసం ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్ సైట్ indiapost.gov.in వెబ్ సైట్ కు లాగిన్ అయి అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు.. ఇది స్టాఫ్ కారు డ్రైవర్ పోస్ట్ కాబట్టి.. లైట్ మోటార్ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్, హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ మెకానిజంపై అవగాహన కూడా ఉండాలి. అలాగే.. లైట్, హెవీ మోటార్ వాహనాలు నడిపిన అనుభవం కనీసం మూడేళ్లు ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి అర్హత సాధించి ఉండాలి.
అభ్యర్థుల వయసు 56 ఏళ్లకు దాటకూడదు.అన్ని అర్హతలు ఉన్నవాళ్లు ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవాలి. ఉద్యోగం వచ్చిన వాళ్లకు హర్యానాలో పోస్టింగ్ ఉంటుంది. అక్కడ కొన్నేళ్లు చేసిన తర్వాత బదిలీలు అవుతాయి. అప్పుడు దేశంలో ఏ ప్రాంతంలో కావాలంటే ఆ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. ఆన్ లైన్ లో అప్లయి చేసిన తర్వాత.. అప్లికేషన్, విద్యార్హత సర్టిఫికెట్లను హర్యానా సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ చిరునామాకు పోస్ట్ లో పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ ఇదే.. The Assistant Director Postal Services(Staff) O/o the Chief Postmaster General, Haryana Circle, The Mail, Ambala Cant–133001.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.