Indian Army | ఇండియన్ ఆర్మీ డీజీ ఈఎంఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ..194 పోస్టులకు ఆహ్వానం
Indian Army | ఐటీఐ పూర్తిచేసిన నిరుద్యోగులకు భారత సైన్యంలో (Indian Army) ఉద్యోగావకాశం లభించనుంది. ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ ఇంజినీర్స్ (DG EME) విభాగంలో ఖాళీగా ఉన్న 194 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నియామక ప్రక్రియలో ఎల్డీసీ (LDC), ఫైర్మెన్, ట్రేడ్స్్మన్ మేట్, స్టోర్ కీపర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), సూపర్ వైజర్, టెక్నీషియన్ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు 2024 అక్టోబర్ 24 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
#image_title
ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టులు: 194
అర్హత:
పదో తరగతి / ఇంటర్ లేదా తత్సమాన అర్హత
సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి
వయోపరిమితి:
కనీసం 18 సంవత్సరాలు
గరిష్ఠంగా 25 సంవత్సరాలు
రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి వయో సడలింపు వర్తిస్తుంది
ఎంపిక విధానం:
రాత పరీక్ష
స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్
డాక్యుమెంట్ల ధృవీకరణ
మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేపడతారు.
దరఖాస్తు & మరిన్ని వివరాలకు:
అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదవడానికి మరియు అప్లై చేయడానికి అధికారిక వెబ్‌సైట్ www.indianarmy.nic.in ని సందర్శించవచ్చు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఐటీఐ విద్యార్థులకు ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. భారత ఆర్మీలో సేవ చేయాలనే లక్ష్యం ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి