Indian Railway Job : ఇంకా రెండే రోజులు గడువు.. ఇండియన్ రైల్వేలో 2,226 జాబ్స్..
Indian Railway Job: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు పడుతాయా?.. తాము వాటికి అప్లై చేసుకుని జాబ్ ఎప్పుడు కొడతామా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అటువంటి నిరుద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. 2,226 ఉద్యోగాలను భర్తీ చేసేందుకుగాను అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకుగాను ఇంకా రెండు రోజులే గడువు ఉంది. భారతీయ రైల్వేలో వేర్వేరు జోన్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకుగాను భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే వేర్వేరే జోన్లలో ఖాళీలు భర్తీ చేసేందుకుగాను అఫీషియల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నది. ఇటీవల కాలంలో విడుదలైన వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లో 2,226 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.
ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్ లాంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 10 చివరి తేదీ కాగా, అందుకు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. ఈ పోస్టులకు పోస్టును బట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌ను నిర్ణయించారు. అయితే, అప్లికేషన్ చేసుకునే ముందర అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదువుకుంటే మంచిది. నోటిఫికేషన్ వివరాలతో పాటు పోస్టుల వివరాలు పోస్టింగ్ ప్లస్ ఇతర అంశాలు స్పష్టంగా నోటిఫికేషన్‌లో ఉంటాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని వారి వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు మహిళలకు ఎటువంటి ఫీజు లేదు.
Indian Railway Job : వేర్వేరు జోన్లలో ఖాళీల భర్తీ..
జనరల్ వారు వంద రూపాయలు చెల్లించాలి. ఇకపోతే అభ్యర్థులు ఏ జాబ్ కోసమైతే అప్లై చేస్తున్నారో అందుక సంబంధించిన ట్రేడ్‌లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలి. పదో తరగతిలో యాభై శాతం మార్కులు కలిగి ఉండటంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి.
మొత్తం ఖాళీలు
డీజిల్ మెకానిక్ – 77
ఎలక్ట్రీషియన్ – 478
వెల్డర్ – 147
మెషినిస్ట్ – 37
ఫిట్టర్ – 491
టర్నర్ – 12
వైర్‌మ్యాన్ – 67
మేసన్ – 86
కార్పెంటర్ – 60
పెయింటర్ – 165
గార్డెనర్ – 4
ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్ – 4
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ – 20
హార్టికల్చర్ అసిస్టెంట్ – 5
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 60
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్- 5
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 155
స్టెనోగ్రాఫర్ (హిందీ) -28
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) – 23
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (జనరల్) – 2
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (వెజిటేరియన్) – 2
అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్ (కుకింగ్)- 5
హోటల్ క్లర్క్ / రిసెప్షనిస్ట్ 1, డిజిటల్ ఫోటోగ్రాఫర్ 1, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ – 1
కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ -4
క్రెచ్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ -1
సెక్రెటేరియల్ అసిస్టెంట్ -4
హౌజ్ కీపర్ -7
హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ -2
డెంటల్ లేబరేటరీ టెక్నీషియన్ -2
మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్యూప్‌మెంట్ మెకానిక్ కమ్ ఆపరేటర్ -5
ఏసీ మెకానిక్ -9
బ్లాక్‌స్మిత్ – 74
కేబుల్ జాయింటర్ -74
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) -1
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) -14
సర్వేయర్-9
ప్లంబర్-66
స్యూయింగ్ టెక్నాలజీ -5
ఇండస్ట్రియల్ పెయింటర్ -5
మెకానిక్ (మోటార్ వెహికిల్) -4
మెకానిక్ (ట్రాక్టర్) -4