Dog: ఉక్రెయిన్‌పై రష్యా దాడి విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ఓటింగ్ కు భారత్ దూరంగా వున్న విషయం విదితమే. ఈ తీర్మానానికి 11 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఇండియా, చైనా, యూఏఈ దేశాలు దూరంగా ఉన్నాయి. ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండటానికి గల కారణాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు. రెండు దేశాలు దౌత్య మార్గాన్ని వదిలేయడం దురదృష్టకరమని చెప్పారు. ఈ కారణాల వల్లే ఓటింగ్ కు భారత్ దూరంగా ఉందని తెలిపారు.
అయితే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులని స్వదేశానికి తరలించేందుకు భారత్ ప్రయత్నిస్తుంది.అయితే ఓ భారతీయుడు మాత్రం తన కుక్క కోసం ఉక్రెయిన్ విడిచి వెళ్లడానికి ఆసక్తిచూపడం లేదు. ఉత్తరాఖండ్‌కి చెందిన రిషబ్ కౌశిక్ ఖార్కీవ్‌లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఆయన తల్లి దండ్రులు ప్రాణ భయంతో దుబాయ్ వెళ్లారు. అయితే శునకాన్ని ఒంటరిగా వదిలి వెళ్లేందుకు కౌశ్‌కికి మనసు అంగీకరించడం లేదు. తాను లేకపోతే కుక్క బాగోగులు పట్టించుకునే వారు లేరని,తనతో పాటు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తానని అంటున్నాడు. మూగ జీవాలపై ఆయనకి ఉన్న ప్రేమని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.
రష్యాకు చెందిన బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. పోరాడేందుకు ఎవరొచ్చినా ఆయుధాలు ఇస్తామని అన్నారు. మరోవైపు రష్యా తనకున్న వీటో అధికారం ఉపయోగించి, తీర్మానాన్ని అడ్డుకుంది. అయితే తీర్మానాన్ని వీగిపోయేలా చేస్తారనే విషయాన్ని తాము ముందే ఊహించామని అమెరికా తెలిపింది. మీరు తీర్మానాన్ని మాత్రమే అడ్డుకోగలరని… నిజాన్ని, సిద్ధాంతాలను, ఉక్రెయిన్ ప్రజలను, తమ గళాన్ని అడ్డుకోలేరని అమెరికా రాయబారి లిండా వ్యాఖ్యానించారు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.