Indian : కుక్క అంటే అంత ప్రేమ‌నా.. మూగ జీవి కోసం ఉక్రెయిన్ వ‌దిలి వెళ్ల‌డానికి ఆస‌క్తి చూప‌ని భారతీయుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Indian : కుక్క అంటే అంత ప్రేమ‌నా.. మూగ జీవి కోసం ఉక్రెయిన్ వ‌దిలి వెళ్ల‌డానికి ఆస‌క్తి చూప‌ని భారతీయుడు

Dog: ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి విష‌యం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ఓటింగ్ కు భారత్ దూరంగా వున్న విషయం విదితమే. ఈ తీర్మానానికి 11 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఇండియా, చైనా, యూఏఈ దేశాలు దూరంగా ఉన్నాయి. ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండటానికి గల కారణాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :27 February 2022,7:40 am

Dog: ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి విష‌యం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ఓటింగ్ కు భారత్ దూరంగా వున్న విషయం విదితమే. ఈ తీర్మానానికి 11 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఇండియా, చైనా, యూఏఈ దేశాలు దూరంగా ఉన్నాయి. ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండటానికి గల కారణాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు. రెండు దేశాలు దౌత్య మార్గాన్ని వదిలేయడం దురదృష్టకరమని చెప్పారు. ఈ కారణాల వల్లే ఓటింగ్ కు భారత్ దూరంగా ఉందని తెలిపారు.

అయితే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భార‌తీయుల‌ని స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు భార‌త్ ప్ర‌య‌త్నిస్తుంది.అయితే ఓ భార‌తీయుడు మాత్రం త‌న కుక్క కోసం ఉక్రెయిన్ విడిచి వెళ్ల‌డానికి ఆస‌క్తిచూప‌డం లేదు. ఉత్త‌రాఖండ్‌కి చెందిన రిష‌బ్ కౌశిక్ ఖార్కీవ్‌లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఆయ‌న త‌ల్లి దండ్రులు ప్రాణ భ‌యంతో దుబాయ్ వెళ్లారు. అయితే శున‌కాన్ని ఒంట‌రిగా వ‌దిలి వెళ్లేందుకు కౌశ్‌కికి మ‌న‌సు అంగీక‌రించ‌డం లేదు. తాను లేక‌పోతే కుక్క బాగోగులు ప‌ట్టించుకునే వారు లేర‌ని,త‌న‌తో పాటు తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని అంటున్నాడు. మూగ జీవాల‌పై ఆయ‌న‌కి ఉన్న ప్రేమ‌ని చూసి ప్ర‌తి ఒక్కరు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

indian shows his love on dog

indian shows his love on dog

Indian : అంత ప్రేమ‌నా..

రష్యాకు చెందిన బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. పోరాడేందుకు ఎవరొచ్చినా ఆయుధాలు ఇస్తామని అన్నారు. మ‌రోవైపు రష్యా తనకున్న వీటో అధికారం ఉపయోగించి, తీర్మానాన్ని అడ్డుకుంది. అయితే తీర్మానాన్ని వీగిపోయేలా చేస్తారనే విషయాన్ని తాము ముందే ఊహించామని అమెరికా తెలిపింది. మీరు తీర్మానాన్ని మాత్రమే అడ్డుకోగలరని… నిజాన్ని, సిద్ధాంతాలను, ఉక్రెయిన్ ప్రజలను, తమ గళాన్ని అడ్డుకోలేరని అమెరికా రాయబారి లిండా వ్యాఖ్యానించారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది