M Venkaiah Naid Covid Positive : భారత ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్.. వారం పాటు హోం ఐసొలేషన్..

Advertisement

M Venkaiah Naid Covid Positive : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ విషయం తెలిపారు. ఈరోజు చేసిన కొవిడ్ టెస్ట్ రిపోర్ట్‌లో తనకు కొవిడ్ పాజిటివ్ అని తేలిందని వెంకయ్య నాయుడు తెలిపారు.

Advertisement

M Venkaiah Naid Covid Positive : కొవిడ్ ప్రొటోకాల్ ఫాలో కానున్న వైస్ ప్రెసిడెంట్..

వెంకయ్యనాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండగా, కొవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి, ఒక వారం రోజుల పాటు ఒంటరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో తనను కలిసిన వారందరూ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. డాక్టర్స్ సూచన మేరకు వైస్ ప్రెసిడెంట్ స్వీయ నిర్బంధంలో వారం రోజుల పాటు ఉండనున్నారు.

Advertisement
indian vice president m venkaiah naidu tested covid positive
indian vice president m venkaiah naidu tested covid positive

ఇకపోతే పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన టెస్టుల ప్రకారం.. ఇప్పటి వరకు మొత్తం 875 మంది కొవిడ్ సోకినట్లు గుర్తించారు. అదే సమయంలో రాజ్యసభ సెక్రెటేరియట్‌లో 271 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇకపోతే ఆదివారం సుభాష్ చంద్రబోస్ 125 వ వర్ధంతి సందర్భంగా నేతాజీసుభాష్ చంద్రబోస్‌కు నివాళి అర్పించారు.

Advertisement
Advertisement