CM KCR : అసలు కేసీఆర్ కు ఏమైంది? టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఎక్కువైన ఆందోళన?
CM KCR : తెలంగాణలో చాప కింద నీరులా కరోనా విస్తరిస్తోంది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నారు. మాస్కులు ధరించినా… శానిటైజర్లు వాడినా కరోనా మాత్రం అంతకంతకు పెరుగుతోంది తప్పితే తగ్గడం లేదు. రోజు రోజుకూ కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. సినిమా సెలబ్రటీల దగ్గర్నుంచి… రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, సామాన్య ప్రజలు… ఇలా ఎవ్వరినీ వదలడం లేదు కరోనా. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కరోనా సోకింది. దీంతో తెలంగాణ ప్రజలంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
కొన్నిసార్లు అజాగ్రత్తగా ఉండటం వల్ల సామాన్య ప్రజలకు కరోనా సోకుతోందంటే ఏమైనా అనుకోవచ్చు కానీ… ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతో హైజినీక్ గా ఉండే సెలబ్రిటీలకు కూడా కరోనా రావడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సీఎం కేసీఆర్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడికెళ్లినా శానిటైజర్ ను వాడుతారు. అటువంటి వాళ్లను కూడా కరోనా వదలడం లేదంటే… ఇంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు జనాలకు.
సీఎం కేసీఆర్ కు కరోనా వచ్చిందని… స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నారని… సీఎస్ ప్రకటన విడుదల చేశారు. తన ఫాం హౌస్ లోనే కేసీఆర్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని… డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తోందని ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ కు కరోనా వచ్చిందని తెలియగానే… టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
CM KCR : యశోదకు సీఎం కేసీఆర్.. హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులు దేవుడిని కోరుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ… సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లారు అనగానే టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన ఎక్కువైంది. దీంతో కేసీఆర్ హెల్త్ బులిటెన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే… కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని… కేవలం టెస్టుల కోసమే కేసీఆర్ ను యశోద ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు… ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు కరోనా వచ్చి మూడు రోజులు అవుతున్నా… ఆయన ఆరోగ్యంపై అధికారికంగా మరోసారి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.