Fixed Deposit Intrest Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై వడ్డీ రేట్లు.. ఎస్బీఐ, పోస్టాఫీస్.. ఏది బెటర్!
Fixed Deposit Intrest Rates : చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బులను రియల్ ఎస్టేట్‌లో పెట్టాలా? గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయాలా? లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలా? అని డైలమాలో ఉంటారు. ఒకవేళ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే బ్యాంకులో వడ్డీ ఎక్కువ వస్తుందా? పోస్టాఫీసులో ఎక్కువగా వస్తుందా? అని ముందే కనుక్కుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా మీరు పెట్టే టర్మ్ డిపాజిట్లకు అధిక వడ్డీ వచ్చే ఆస్కారం ఉంటుంది. మీ పెట్టిన డబ్బులకు మంచి రిటర్న పొందొచ్చు..సాధారణంగా బ్యాంకుల్లో FDలకు 7 రోజుల నుంచి పదేళ్ల దాకా టెన్యూర్ ఉంటుంది. బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక వడ్డీని ఇస్తుంటాయి.
ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే రూ.5 లక్షల వరకే తిరిగి పొందుతారని గుర్తుంచుకోండి.ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం రూ.5 వేలు డిపాజిట్ చేయాలి. వడ్డీ రేటు 4 నుంచి 7.5 శాతం వరకు వస్తుంది. పోస్టాఫీసు కూడా టర్మ్ డిపాజిట్స్ పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీసులను అందిస్తోంది. వీటి మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు. బ్యాంకుల కంటే కొంచెం టెన్యూర్ తక్కువగా ఉంటుంది. పోస్టాఫీసుల్లో మాములుగా 1, 2, 3, 5 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. టెన్యూర్‌ను బట్టి వడ్డీ రేటు మారుతుంది. ఏడాది నుంచి మూడేళ్లలోపు టర్మ్ డిపాజిట్లకు 5.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల టెన్యూర్ టర్మ్ డిపాజిట్లకు 6.7 శాతం వడ్డీ లభిస్తోంది.

interest rates on fixed deposits sbi vs post office which is better
Fixed Deposit Intrest Rates : ఎస్బీఐ లేదా పోస్టాఫీస్ ఏది బెటర్..
SBI బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి. 7 రోజుల నుంచి 45 రోజులు – 2.9 శాతం, 46 రోజుల నుంచి 179 రోజులు – 3.9 శాతం, 180 రోజుల నుంచి 210 రోజులు – 4.4 శాతం, 211 రోజుల నుంచి ఏడాదిలోపు – 4.4 శాతం, ఏడాది నుంచి రెండేళ్లలోపు – 5 శాతం, 2 ఏళ్ల నుంచి మూడేళ్లలోపు – 5.1 శాతం, మూడేళ్ల నుంచి 5 ఏళ్లలోపు – 5.3 శాతం, 5 ఏళ్ల నుంచి పదేళ్లలోపు – 5.4 శాతంగా ఉంది. ఎస్బీఐ గరిష్టంగా 5.4 శాతం వరకు వడ్డీ ఇస్తుండగా, పోస్టాఫీస్‌లో 6.7 శాతంగా ఉంది. దీనిని బట్టి పోస్టాఫీసులో డబ్బులు డిపాజిట్ చేస్తే బెటర్. మీ డబ్బుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది.