Women : మనకు ఈ ప్రపంచంలో తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందులో స్త్రీలకు అంటే మహిళలకు సంబంధించినవి కూడా చాలా ఉంటాయి. నిజానికి మహిళ లేకుంటే ఈ సృష్టే లేదు. ఎందుకంటే ఒక బిడ్డకు జన్మనిచ్చే యోగ్యత ఒక మహిళకే ఉంటుంది. మగవారికి ఉండదు. స్త్రీ జాతి ఈ ప్రపంచంలో లేకపోతే ఈ ప్రపంచం ఎప్పుడో అంతం అయిపోయి ఉండేది. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా సరే స్త్రీలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. స్త్రీల గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మగవాళ్లకు, ఆడవాళ్లకు చాలా తేడాలు ఉంటాయి. పూర్వకాలంలో స్త్రీలకు సంబంధించిన ముఖ్య విషయాలు కూడా తెలియదు. అమెరికాలో సుమారుగా 40 శాతం మంది అమ్మాయిలు పెళ్లి కాకముందే తల్లులు అవుతున్నారు. మనకు దేని రుచి అయినా తెలియాలంటే నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ ఉపయోగపడతాయి. ఈ టేస్ట్ బడ్స్ మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటాయి. ఆడవారు సంవత్సరానికి సుమారుగా 30 నుంచి 60 రోజుల వరకు ఏదో ఒక కారణంతో ఏడుస్తూనే ఉంటారు.

Unknown Facts About Women : ప్రతి 90 సెకన్లకు ఒకరికి జన్మనిస్తున్న మహిళ
ఈ ప్రపంచంలో ప్రతి 90 సెకన్లకు ఒక మనిషికి మహిళ జన్మనిస్తుంది. అయితే.. అందులో ప్రతి 90 సెకన్లలో ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. యూఎస్ లో జరిగిన ఓ సర్వే ప్రకారం కలయిక సమయంలో స్కలనం వచ్చినప్పుడు తమకు నొప్పిగా ఉంటుందని 40 శాతం మంది మహిళలు చెప్పారు. గర్భిణీగా ఉన్నప్పుడు మహిళ గురక పెట్టి నిద్రపోతే పుట్టబోయే బిడ్డ తక్కువ బలంతో పుడతాడని పరిశోధనలో తేలింది. రష్యాలో మగవారి కంటే ఆడవారి జనాభానే ఎక్కువ. సుమారు 90 లక్షల మంది ఉన్నారు.
ఆడవారికి ప్రతి నెల రుతుక్రమం వస్తుంది. ప్రతి స్త్రీ తమ జీవితకాలంలో 4 సంవత్సరాలు రుతుక్రమంలోనే గడుపుతారు. ఆడవారు రోజుకు సుమారుగా 20 వేల వరకు పదాలను మాట్లాడుతారు. కానీ.. మగవారు మాత్రం 10 నుంచి 13 వేల వరకు మాత్రమే పదాలను వాడుతారు. ప్రతి స్త్రీ తమ అందాన్ని వేరే వాళ్లు పొగడాలనే అనుకుంటారు. కానీ.. 2 శాతం మంది మహిళలు మాత్రం తమ అందాన్ని తామే పొగుడుకుంటారు. ఎత్తుగా ఉండే ఆడవాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తమ జీవితంలో సంవత్సర కాలం పాటు ఎలా రెడీ అవ్వాలి.. ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అని ఆలోచిస్తుంటారు.