ap 3 capitals : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలలు కంటున్నట్లుగా అతి త్వరలోనే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు కాబోతున్నాయి. అభివృద్ది వికేంద్రీకరణ కోసం అంటూ ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాధన తీసుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. మొత్తం 101 వ్యాజ్యాలు కోర్టులో ఈ విషయమై ఉన్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత దూకుడుగా ఉన్నాడో కోర్టు అంత స్లోగా ఆ వ్యాజ్యాలను విచారిస్తున్నాయి. కోర్టు లో జరుగుతున్న ఆలస్యం కారణంగా వైకాపా ప్రభుత్వం కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధ్యం అయినంత త్వరగా రాజధానులను మార్చాలని భావిస్తున్నారు.
ఈ సమయంలో కోర్టులో ఉన్న ఈ వ్యాజ్యాలను వెంటనే విచారించేందుకు గాను ప్రత్యేక బెంజ్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ పిటీషన్ల పై మార్చి 26వ తారీకు నుండి రెగ్యులర్ గా విచారణ జరుపనున్న నేపథ్యంలో అతి త్వరలోనే రాజధాని విషయమై ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లును ఆమోదింపజేసి గవర్నర్ తో కూడా గెజిట్ వేయించారు. కాని మండలిలో దీనికి అనుమతి రాకపోవడంతో పాటు అనేక కారణాలతో హైకోర్టులో వ్యాజ్యాలు నమోదు అయ్యాయి.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టీస్ మహేశ్వరి బదిలీ అవ్వడం వల్ల నిలిచి పోయిన విచారణ మళ్లీ ప్రారంభించబోతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆరు నెలల నుండి ఏడాది కాలంలోనే ఈ విచారణ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు ప్రభుత్వం తరపున లాయర్ విచారణ వేగవంతం చేయాలని కోర్టును కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్న ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఏడాదిలో మూడు రాజధానుల నుండి పరిపాలన కొనసాగే అవకాశం ఉందంటున్నారు. చాలా పట్టుబట్టి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను తీసుకు వచ్చాడు. ఆ నిర్ణయంపై వ్యతిరేకత ఉన్న కారణంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందనుకున్నారు. కాని అనూహ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి విజయవాడ వాసులు కూడా సమర్థన తెలిపినట్లుగా అనిపిస్తుంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.