Jr ntr : తెలుగు దేశం పార్టీ ఏపీలో మరీ దారుణ పరిస్థితికి దిగజారి పోయింది. ఆ పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంను చవి చూసింది. ఆ తర్వాత జరుగుతున్న వరుస ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు మరో ఘోర పరాభవం తప్పలేదు. అందుకే తెలుగు దేశం పార్టీని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అప్పగించాలంటూ ఒక వర్గం నందమూరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వైకాపా మంత్రి కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. హీరోగా బిజీగా ఉన్న ఎన్టీఆర్ అయితేనే మళ్లీ తెలుగు దేశం పార్టీకి జీవం వస్తుందని కొందరు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ కొందరు రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు.
కీరవాణి కొడుకులు చేసిన తెల్లవారితే గురువారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఇతరులు మాట్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్ సీఎం.. ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు సందడి చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో వారి సీఎం నినాదాలు మారుమ్రోగిపోయాయి. దాంతో ఎన్టీఆర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ఆగండి బ్రదర్ అంటూ అభిమానులను ఆపే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అభిమానులు ఆపక పోవడంతో కోపంతో ఆపమని చెప్పా అంటూ సీరియస్ అయ్యాడు. దాంతో అభిమానులు కాస్త సైలెంట్ అయ్యారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు దేశం పార్టీ బాధ్యతలను నెత్తిన ఎత్తుకోవాల్సిందే అంటూ నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు హీరోగా బిజీగా ఉన్న ఎన్టీఆర్ భవిష్యత్తులో అయినా టీడీపీ బాధ్యతలు తీసుకోవాల్సిందే అంటున్నారు. చంద్రబాబు నాయుడు వయసు రీత్యా ఆయన తప్పుకున్న తర్వాత అయినా ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందే అంటూ కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు. నారా లోకేష్ మరియు ఎన్టీఆర్ ల్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ కే ఆ పార్టీలో ఎక్కువ మద్దతు ఉంది అనడంలో సందేహం లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.