IOCL : పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో వాహనదారులకు షాకిచ్చిన IOCL..!!
IOCL: దేశంలో సామాన్యుడు బతికే రోజులు అంతరించిపోతున్నాయి. ఒకపక్క నిత్యవసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.. దేశంలో ఇంధన ధరలు తగ్గించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మొదట పెట్రోల్, డీజిల్ పై 40 పైసలు తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. దీంతో వాహనాదురులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇంతలోనే తగ్గిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం పై IOCL వెనక్కి తగ్గడం జరిగింది. ఇంధన ధరలు తగ్గిస్తున్నట్లు..

IOCL Bid News with petrol and diesel prices
ప్రకటనపై ఉపసంహరించుకున్నట్లు తెలిపి వాహనాదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో ఇంధన ధరలలో ఎటువంటి తగ్గింపు లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) స్పష్టం చేయడం జరిగింది. ముందు ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గటంపై IOCL పై వాహనాదారులు మండిపడుతున్నారు.