Pan Card : పాన్ కార్డ్ దుర్వినియోగం అయిందా.. ఇలా కంప్లెంట్ చేయండి
Pan Card : పాన్ కార్డ్ అనేది బ్యాంకింగ్, ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు నిర్వహించేందుకు అతి కీలకమైన డాక్యుమెంట్. సాధారణంగా పాన్ కార్డును ఎక్కువగా ఐడీ ఫ్రూవ్ గా ఉపయోగిస్తుంటాం. బ్యాంకింగ్, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఈపీఎఫ్ డబ్బు డిపాజిట్ చేసినా పాన్ తప్పనిసరి. పాన్ లేకుండా ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలనూ నిర్వహించలేము. ఈ కారణంగా.. ప్రజలు తప్పనిసరిగా చాలా చోట్ల పాన్ కార్డ్ వివరాలను అందించాల్సి ఉంటుంది.అయితే పాన్ వివరాలు ఎక్కడెక్కడ ఇచ్చారో తప్పనిసరిగా అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కీలకమైన పాన్ కార్డును కొందరు సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు దుర్వినియోగపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే.. మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతుందా? దాని సాయంతో ఏదైనా మోసం జరుగుతోందా? అని తెలుసుకోవడం చాలా కీలకం.పాన్ కార్డ్ అనేది వ్యక్తిగతంగా చాలా కీలకమైనది. ఆదాయపు పన్ను శాఖ కు సంబంధించి ప్రతీ పనికి ఇది అవసరం.
అందుకే మీ పాన్ విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. రుణాలు, అప్పుల విషయాన్ని పక్కన పెడితే.. చాలా చిన్న చిన్న వాటికి కూడా పాన్ తప్పనిసరి అయ్యింది. రైల్వేలో హోటల్స్ బుక్ చేయాలన్నా.. తత్కాల్ టిక్కెట్లు తీసుకోవాలన్నా.. పాన్ కార్డు తప్పనిసరి. అయితే పాన్ కార్డు వివరాలను ఇచ్చిన తరువాత మనం వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ మీ పాన్ వివరాలు దుర్వినియోగం అవుతున్నాయా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.పాన్ దుర్వినియోగం గురించి తెలుసుకోవడానికి ఫారం 26 AS ని ఇన్ కం ట్యాక్స్ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిని ట్రేస్ పోర్టల్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అన్ని లావాదేవీలను చెక్ చేయవచ్చు. తద్వారా మీ పాన్ కార్డ్ దుర్వినియోగమయ్యిందా? సరిగ్గానే ఉందా? అనేది తెలుసుకోవచ్చు. అయితే పాన్ తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఉపయోగించండి.
Pan Card : తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి..
అంటే, పాన్ ఇవ్వకుండా పని జరగదు అన్న చోట మాత్రమే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. ఒకవేళ మీరు పాన్ కార్డ్ కాపీని ఇస్తుంటే దానిపై సంతకం చేయాలి… తేదీ రాయాలి.. మీరు ఏ ప్రయోజనం కోసం పాన్ ఉపయోగిస్తున్నారో కూడా రాయాలి. అలాగే మీకు పాన్ ఉంటే ఆదాయపు పన్ను పోర్టల్ లో ఖచ్చితంగా ఖాతాను తెరవాలి. అయితే ఖాతా తీయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు.అయితే పాన్ కు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ ఎలక్ట్రానిక్ పోర్టల్ ను రూపొందించింది. ఇందుకోసం ఆదాయపు పన్ను సంప్రదింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యూటీఐటీఎస్ఎల్ కి నేరుగా లింక్ చేయబడిన ఈ పోర్ట్ ద్వారా పాన్ ఫిర్యాదులను చేయవచ్చు.ఇలా ఫిర్యాదు చేయండిద.. https://incometax.intalenetglobal.com/pan/pan.asp సైట్ కి వెళ్లండి. సమర్పించు బటన్ క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ఫిర్యాదు రకం, రశీదు సంఖ్య వంటివి నమోదు చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది.