PAN Card : పాన్ కార్డు తో రూ. 5 లక్షల రుణం పొందే ఛాన్స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 May 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  PAN Card : పాన్ కార్డు తో రూ. 5 లక్షల రుణం పొందే ఛాన్స్..!

PAN Card : పాన్ కార్డు కేవలం ఒక గుర్తింపు గానే కాకుండా, ఆర్థిక లావాదేవీలలో వ్యక్తి విశ్వసనీయతను నిరూపించే ప్రధాన సాధనంగా మారింది. పాన్ కార్డు ఆధారంగా వ్యక్తిగత రుణం పొందడం ప్రస్తుతం చాలా సులభంగా మారింది. ఎందుకంటే ఇది బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు దరఖాస్తుదారుని KYC పూర్తి చేయడాన్ని వేగవంతం చేస్తుంది. ప్రత్యేకించి, ఆధార్‌తో పాన్ లింక్ చేయడం వల్ల రుణం ఈజీ గా పొందవచ్చు. దీనికి సరైన పత్రాలు సమర్పిస్తే, సాధారణంగా 24 గంటల్లో రుణం మంజూరు అవుతుంది.

PAN Card : పాన్ కార్డు తో రూ. 5 లక్షల రుణం పొందే ఛాన్స్..!

PAN Card : పాన్ కార్డు తో రూ. 5 లక్షల రుణం పొందే ఛాన్స్..!

PAN Card : పాన్ కార్డు ద్వారా రూ.5 లక్షల రుణం తీసుకోవచ్చు.. దీనికి ఏంచేయాలంటే..!!

పాన్ కార్డుపై రుణం పొందాలంటే దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి. వయస్సు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అతనికి స్థిర ఆదాయ వనరు ఉండాలి, అలాగే మంచి క్రెడిట్ స్కోరు అవసరం. రుణం కోసం పాన్, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు, చిరునామా ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, జీతపు స్లిప్‌లు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ పత్రాల ఆధారంగా బ్యాంకులు దరఖాస్తుదారుని ఆర్థిక స్థితిని అంచనా వేస్తాయి.

రుణం కోసం మీరు ఎంచుకున్న బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. మొబైల్ నంబర్, పాన్ వివరాలు, పుట్టిన తేదీ వంటి సమాచారం ఇచ్చిన తర్వాత e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. ఆపై రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలవ్యవధి ఎంచుకుని దరఖాస్తును సమర్పించవచ్చు. పాన్ కార్డు కేవలం రుణాలకే కాదు – పన్నుల చెల్లింపు, బ్యాంక్ ఖాతా ఓపెనింగ్, షేర్ మార్కెట్, ఆస్తి కొనుగోలు వంటి ఎన్నో ఆర్థిక కార్యకలాపాలకు తప్పనిసరి పత్రంగా ఉపయోగించబడుతుంది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి