Categories: ExclusiveNews

Shivani Raja : యూకే పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం చేసిన బ్రిటన్‌ ఎంపీ.. వైర‌ల్ అవుతున్న వీడియో

Shivani Raja : ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నేత శివానీ రాజా చరిత్ర సృష్టించారు. లీసెస్టర్ ఈస్ట్ సీటు నుండి ఎన్నికల బరిలో దిగిన ఆమె ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన రాజేశ్ అగర్వాల్‌పై భారీ మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఈ క్ర‌మంలో దాదాపు 37 ఏళ్ల తరువాత ఆ నియోజకవర్గంలో కన్జర్వేటివ్ పార్టీ గెలుపొందింది.అయితే ఆమె భ‌గ‌వ‌ద్గీత మీద ప్ర‌మాణం చేయ‌డం అందరి దృష్టిని ఆక‌ర్షించింది. గతంలో భారత సంతతి ఎంపీలు అలోక్ శర్మ, రుషి సునక్ లు భగవద్గీతపై ప్రమాణం చేయ‌గా, ఇప్పుడు శివానీ రాజా కూడా అలానే ప్రమాణం చేశారు.

Shivani Raja భగవద్గీతపై ప్రమాణం..

దిగువ సభలో జరిగిన కార్యక్రమంలో శివానీ భగవద్గీతపై ప్రమాణం చేసి తన ఎంపీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం, ఆమె ఎక్స్ వేదిగా తన సంతోషాన్ని పంచుకున్నారు. భగవద్గీత సాక్షిగా బ్రిటన్ రాజు విశ్వసనీయురాలిగా ఉంటానంటూ ప్రమాణం చేయడం తన జీవితంలో మరిచిపోలేని రోజని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్‌కు 10,100 ఓట్లు రాగా శివానీకి 14526 ఓట్లు పోలయ్యాయి. ఇటీవల టీ20 మ్యాచ్ సందర్భంగా స్థానిక హిందూ, ముస్లిం మతస్తుల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో శివానీ ఎన్నికకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

Shivani Raja : యూకే పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం చేసిన బ్రిటన్‌ ఎంపీ.. వైర‌ల్ అవుతున్న వీడియో

ఇక ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది దిగువ సభకు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా, రికార్డు స్థాయిలో 263 మంది మహిళలు ఎంపీలుగా గెలుపొందారు. ఇక సభలో శ్వేతజాతీయేతర ఎంపీల సంఖ్య కూడా మునుపెన్నడూ లేని విధంగా 90కి చేరింది. బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ దేశాన్ని పునర్నిర్మిస్తానని అన్నారు.. ఆయన సారథ్యంలోని లేబర్ పార్టీ మొత్తం 650 సీట్లకు గాను 412 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మాజీ ప్రధాని రిషి సునాక్ అన్నారు. ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి గూడుకట్టుకున్నాయని ఆయన అంగీకరించారు.

Share

Recent Posts

Health Tips : ఈ రెండు పండ్లు కలిపి అస‌లు తినకూడదు.. ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు ఇవే…

Health Tips :  పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనడం నిజమే. కానీ కొన్ని పండ్లను కలిపి తినడం శరీరానికి హానికరంగా…

48 minutes ago

Vastu Tips | గణేష్ చతుర్థి ప్రత్యేకం..వాస్తు ప్రకారం వినాయక విగ్రహాన్ని ఎలా, ఎక్కడ ప్రతిష్టించాలి?

Vastu Tips | గణేష్ చతుర్థి రోజు సమీపిస్తుండటంతో హిందూ భక్తుల్లో పండుగ ఉత్సాహం నెలకొంది. 2025 ఆగస్టు 27న ఈ…

2 hours ago

AP New Ration Cards : ఏపీలో ముందుగా కొత్త రేషన్ కార్డులు పంచేది ఆ జిల్లాలోనే !!

New Ration Cards : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది.…

12 hours ago

Kukatpally Girl Murder Mystery : వీడిన కూకట్‌పల్లి బాలిక మర్డర్ మిస్టరీ..చంపింది ఎవరో తెలుసా..?

Kukatpally Girl Murder Mystery : హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్‌పల్లి బాలిక హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం…

13 hours ago

Central New Bill : అరెస్ట్ అయితే సీఎం అయినాసరే పదవి కోల్పోవాల్సిందే – మోడీ సంచలన వ్యాఖ్యలు

Central New Bill : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతిని అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లులకు బలమైన మద్దతు…

14 hours ago

AP Liquor Scam Case : నెక్స్ట్ అరెస్ట్ ఆయనేనా..? వైసీపీ లో టెన్షన్ వాతావరణం !!

AP Liquor Scam Case Update : ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో మాజీ…

15 hours ago

Seethamma vakitlo sirimalle chettu| సీత‌మ్మవాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రంలో వెంకీ, మ‌హేష్ పేర్లు అవా.. సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన శ్రీకాంత్

Seethamma vakitlo sirimalle chettu| తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె…

16 hours ago

Street Dogs | వీధి కుక్కలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు..జంతు ప్రేమికులకు ఊరట

Street Dogs | వీధి కుక్కల సమస్యపై జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో…

17 hours ago