Vegetables And Fruits : వీటిని పచ్చిగా తింటే ప్రమాదమేనా?.. ఈ కూరగాయలు, పండ్ల విషయంలో జాగ్రత్తలు ఇవే..!
ప్రధానాంశాలు:
Vegetables And Fruits : వీటిని పచ్చిగా తింటే ప్రమాదమేనా?.. ఈ కూరగాయలు, పండ్ల విషయంలో జాగ్రత్తలు ఇవే..!
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి కూరగాయను ప్రతి పండును పచ్చిగానే తినొచ్చని అనుకోవడం పొరపాటు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలు ఉడికించకుండా నేరుగా తింటే శరీరానికి మేలు చేయడం కాదు పైగా విషం తిన్నట్టే ప్రభావం చూపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా పచ్చిగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Vegetables and fruits : వీటిని పచ్చిగా తింటే ప్రమాదమేనా?.. ఈ కూరగాయలు, పండ్ల విషయంలో జాగ్రత్తలు ఇవే..!
Vegetables And Fruits : కాసావా..పచ్చిగా తింటే ప్రాణాలకు ముప్పు
కాసావా Cassava అనేది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించే దుంప. అయితే దీనిని పచ్చిగా తినడం చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కారణం ఏమిటంటే ఇందులో సహజంగానే సైనైడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి తక్కువ మోతాదులో ఉన్నా శరీరంలోకి వెళ్లిన తర్వాత నెమ్మదిగా ప్రభావం చూపిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. సరైన విధంగా ఉడికించకుండా లేదా ప్రాసెస్ చేయకుండా కాసావాను తింటే తలనొప్పి, వాంతులు, శ్వాసకోశ సమస్యలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీర్ఘకాలంలో ఇవి నరాల వ్యవస్థపై కూడా దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Vegetables And Fruits : చెర్రీస్ విత్తనాలు: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం
చెర్రీస్ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిలోని విత్తనాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. చెర్రీస్ సీడ్స్‌లో అమిగ్డాలిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత సైనైడ్‌గా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒకటి రెండు విత్తనాలు ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ, ఎక్కువ సంఖ్యలో విత్తనాలను మింగితే ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు చెర్రీస్ తినేటప్పుడు సీడ్స్ మింగకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Vegetables And Fruits : బంగాళాదుంపలు, టమోటాలు: పచ్చిగా తినేముందు ఆలోచించండి
బంగాళాదుంపలు మనం వారానికి రెండు మూడు సార్లు తింటుంటాం. అయితే కొందరు వాటిని పచ్చిగానే తినడం అలవాటుగా పెట్టుకుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. బంగాళాదుంపల పైభాగంలో లేదా మొలకలు వచ్చినప్పుడు సోలనిన్ అనే విషపూరిత పదార్థం ఏర్పడుతుంది. ఇది పచ్చిగా తింటే కడుపునొప్పి, వాంతులు, నరాల సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాపాయానికి కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే టమోటాలను కూడా కొందరు నేరుగా పచ్చిగానే తింటారు. పూర్తిగా పండని టమోటాల్లో టోమాటిన్ అనే విషపదార్థం ఉంటుంది. ఇది అధికంగా శరీరంలోకి వెళ్లితే ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే టమోటాలు పూర్తిగా పండిన తర్వాత లేదా వండిన రూపంలోనే తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి కూరగాయ, ప్రతి పండు ఆరోగ్యానికే అన్న భావన తప్పు. వాటిని ఎలా తింటున్నామన్నదే అసలు కీలకం. కాబట్టి పచ్చిగా తినేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవసరమైతే ఉడికించి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.