Tomatoes : టమాటాలను ఈ కూరల్లో ఎందుకు వేయొద్దు?....కారణం తెలిస్తే ఆశ్చర్యమే..!

Tomatoes : టమాటాలను ఈ కూరల్లో ఎందుకు వేయొద్దు?….కారణం తెలిస్తే ఆశ్చర్యమే..!

 Authored By suma | The Telugu News | Updated on :25 January 2026,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tomatoes : టమాటాలను ఈ కూరల్లో ఎందుకు వేయొద్దు?....కారణం తెలిస్తే ఆశ్చర్యమే..!

Tomatoes : మన ఇంటి వంటల్లో Home cooking టమాటా లేనిదే కూర పూర్తయినట్టు అనిపించదు. కూర, పప్పు, గ్రేవీ, నాన్‌వెజ్ ఏదైనా సరే టమాటా తప్పనిసరి అన్న భావన చాలా మందిలో ఉంది. కానీ నిజానికి కొన్ని కూరగాయలకు టమాటా అస్సలు సరిపోదు. పొరపాటున కూడా టమాటా  Tomatoe వేస్తే ఆ కూర రుచి మాత్రమే కాదు మొత్తం వంట స్వరూపమే మారిపోతుంది. మరి టమాటాను ఎందుకు దూరంగా పెట్టాలో ఏ కూరల్లో వేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Do not add tomatoes to these curries

Tomatoes : టమాటాలను ఈ కూరల్లో ఎందుకు వేయొద్దు?….కారణం తెలిస్తే ఆశ్చర్యమే..!

Tomatoes : బెండకాయ, కాకరకాయ, పాల గుమ్మడికాయల్లో టమాటా ఎందుకు వద్దంటే?

బెండకాయలో  Ladies Fingers సహజంగా ఉండే జిగురు లక్షణం టమాటాలోని తేమతో కలిస్తే కూర అతిగా జిగటగా మారుతుంది. క్రిస్పీగా పొడిపొడిగా ఉండాల్సిన బెండకాయ వేపుడు తినలేనంతగా మారిపోతుంది. అందుకే బెండకాయ కూరల్లో టమాటా పూర్తిగా మానేయడం మంచిది. పులుపు కావాలంటే చివర్‌లో కాస్త నిమ్మరసం లేదా ఆమ్చూర్ పొడి చాలు. కాకరకాయకు దాని చేదు రుచే ప్రత్యేకత. ఆ చేదుతో పాటు టమాటా పులుపు కలిస్తే రుచి అసహ్యంగా మారే అవకాశం ఉంది. ఇక పాల గుమ్మడికాయ విషయానికి వస్తే దానిలో సహజమైన తీపి ఉంటుంది. టమాటా వేసిన వెంటనే ఆ తీపి పూర్తిగా కనుమరుగై కూర అనవసరంగా పుల్లగా మారుతుంది.

Tomatoes : పెరుగుతో చేసే వంటల్లో టమాటా ప్రమాదమే

మజ్జిగ పులుసు, కడి, పెరుగుతో  curd చేసే స్పెషల్ గ్రేవీల్లో ఇప్పటికే పులుపు ఉంటుంది. ఈ వంటల్లో మళ్లీ టమాటా కలిపితే పులుపు మోతాదు మించిపోతుంది. ఫలితంగా కూర తినడానికి ఇబ్బందిగా మారడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశముంటుంది. పెరుగు ప్రధానంగా ఉండే వంటల్లో టమాటా వాడకాన్ని పూర్తిగా నివారించడమే ఆరోగ్యానికి మంచిది. ఈ వంటల్లో రుచిని పెంచాలంటే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వంటి పదార్థాలు చాలు.

Tomatoes : పప్పులు, శనగల కూరల్లో టమాటా ప్రభావం

తెల్ల బఠానీలు, శనగలు, అలసందలు వంటి పప్పు దినుసులకు ఒక ప్రత్యేకమైన వాసన, రుచి ఉంటుంది. కానీ వీటిలో టమాటాలు ఎక్కువగా వేస్తే ఆ సహజ రుచి పూర్తిగా కనుమరుగై టమాటా రుచి ఆధిపత్యం చెలాయిస్తుంది. మసాలాల ఘాటు, పప్పుల సువాసనను సహాజంగా ఆస్వాదించాలంటే టమాటా పరిమాణాన్ని తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి.

Tomatoes : టమాటాకు ప్రత్యామ్నాయాలు ఇవే!

ప్రతి వంటలో పులుపు కోసం టమాటానే వాడాలనే నియమం లేదు. వంటకాన్ని బట్టి చింతపండు, నిమ్మరసం, పెరుగు లేదా ఆమ్చూర్ పొడిని ఉపయోగిస్తే ఆయా కూరగాయల అసలు రుచి నిలిచిపోతుంది. చిన్న మార్పులతో వంట రుచి రెట్టింపు చేయొచ్చు. ఇకపై కూర చేసేటప్పుడు టమాటా వేయేముందు ఒక్కసారి ఆలోచిస్తే చాలు మీ వంటకు కొత్త రుచి తప్పకుండా దొరుకుతుంది.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది