kcr : సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కంటే కవిత ఎక్కువనా? ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే!
kcr : తెలంగాణ సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ గత ఏడాది కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీ నాయకులు ముఖ్యంగా మంత్రులు కూడా కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడని, యాదాద్రి దేవాలయం ప్రారంభం అయిన వెంటనే కేసీఆర్ పదవి బాద్యతల నుండి తప్పుకుని కేటీఆర్ కు సీఎం పదవి కట్ట బెట్టే యోచనలో ఉన్నాడు అంటూ మంత్రులు పలువురు మీడియా ముందు అధికారికంగా చెప్పడం జరిగింది. ఆ వార్తలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యాడు. మంత్రులు హద్దుల్లో ఉండి మాట్లాడాలి, లేదంటే సీరియస్ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కేసీఆర్ మాట తీరును చూస్తుంటే కేటీఆర్ ను ఇప్పట్లో సీఎంగా చేసే అవకాశం లేదని తేలిపోయింది.
kcr : కవితకు ప్రాధాన్యత…
కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కు మొదటి నుండి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. అయితే ఈమద్య కాలంలో కవితకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందా అంటే అవును అనే సమాధానం పార్టీ వర్గాల నుండి వినిపిస్తుంది. మొన్నటి పార్టీ కార్యవర్గ సమావేశంలో కవితకు సముచిత స్థానం ను కేసీఆర్ ఇచ్చారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ భవన్ లోకి సీఎం కేసీఆర్ మరియు ఎమ్మెల్సీ కవిత వాహనాలు తప్ప ఇతర వాహనాలు అన్ని కూడా బయటే ఉన్నాయి. మంత్రి కేటీఆర్ ఇతర మంత్రుల వాహనాలు సీనియర్ నాయకుల వాహనాలు ఇలా అన్ని కూడా తెలంగాణ భవన్ గేటు బయటే ఆపేశారు. కవితకు మాత్రమే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటూ టీఆర్‌ఎస్ వర్గాల వారు చెవులు కొరుక్కున్నారు.
త్వరలో కవితకు మంత్రి పదవి, ఆ తర్వాత సీఎం..
ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన కూతురు కవితను త్వరలోనే మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి ముందే కవితను మంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని భావిస్తున్నారట. ఈ విషయంలో కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ గా మంత్రి వర్గంలోకి చేరబోతున్న కవిత భవిష్యత్తులో సీఎంగా కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.