Kalvakuntla Kavitha : కవిత ద్వారా కెసిఆర్ మెడకి ఉచ్చు బిగించబోతోన్న మోడీ.. బిగ్ ప్లాన్ ఇది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kalvakuntla Kavitha : కవిత ద్వారా కెసిఆర్ మెడకి ఉచ్చు బిగించబోతోన్న మోడీ.. బిగ్ ప్లాన్ ఇది..!

Kalvakuntla Kavitha : ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాస్త కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. అవును.. ఎందుకంటే.. ఈ స్కామ్ లో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత చిక్కుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా ఈ కేసులో ఉన్నారు. ఈడీ ఇటీవలే ఈ స్కామ్ పై వీళ్ల పేర్లను చార్జ్ షీట్ లో చేర్చింది. ఆ లిస్టులో వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా చేర్చారు. లిక్కర్ స్కామ్ లో అసలు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :9 February 2023,8:00 am

Kalvakuntla Kavitha : ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాస్త కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. అవును.. ఎందుకంటే.. ఈ స్కామ్ లో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత చిక్కుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా ఈ కేసులో ఉన్నారు. ఈడీ ఇటీవలే ఈ స్కామ్ పై వీళ్ల పేర్లను చార్జ్ షీట్ లో చేర్చింది. ఆ లిస్టులో వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా చేర్చారు. లిక్కర్ స్కామ్ లో అసలు కవిత పాత్ర ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. చార్జ్ షీట్ లో ఆమె పేరు రావడంతో కవిత ఈ స్కామ్ లో ఇరుక్కుపోయినట్టే అని అనిపిస్తోంది.

is kcr screwed by ed with kalvakuntla kavitha

is kcr screwed by ed with kalvakuntla kavitha

ఎందుకంటే.. కవిత పాత్ర ఇందులో ఉన్నట్టు పక్కాగా తెలిసిపోతోంది. ఆ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించేందుకు కవిత ఇన్నాళ్లూ ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే.. తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కూడా తెలియదు. ప్రస్తుతం బీజేపీ టార్గెట్ తెలంగాణ కాబట్టి.. ఈడీ ఈ కేసులో కవితపైనే ముందు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను దెబ్బ కొట్టాలంటే అది కేవలం ఈ స్కామ్ ద్వారానే సాధ్యం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎన్నికల ముంగిట ఈ కేసుపై దృష్టి సారించింది.

is kcr screwed by ed with kalvakuntla kavitha

is kcr screwed by ed with kalvakuntla kavitha

Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ పార్టీకి కళ్లెం వేయడానికేనా?

బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం దేశమంతా విస్తరిస్తోంది. ఈనేపథ్యంలో పార్టీకి కళ్లెం వేయాలంటే… కేసీఆర్ ను ఈ స్కామ్ లోనే ఇరికించాలని అనుకుంటోంది బీజేపీ ప్రభుత్వం. అందుకే.. లిక్కర్ స్కామ్ లో కవితను అడ్డం పెట్టుకొని కేసీఆర్ కు కళ్లెం వస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో పాగా వేయడం ఆపేస్తుందని.. లేకపోతే పార్టీ ఇతర రాష్ట్రాల్లో పాగా వేసిందంటే అది బీజేపీకి మైనస్ అవుతుందని భావించి ఈ ప్లాన్ ను బీజేపీ సెట్ చేసినట్టు తెలుస్తోంది. కవిత ద్వారా కేసీఆర్ కు కేంద్రం ఉచ్చు బిగించబోతుందని అర్థం అవుతోంది. చూద్దాం మరి.. ఈ కేసు ఇంకా ఎంత దూరం వెళ్తుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది