Jabardasth : అనసూయ, రష్మీ.. ఇద్దరు యాంకర్లు కలిసిపోయారోచ్.. ఇక రచ్చ రంబోలానే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 June 2021,3:45 pm

Jabardasth : జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ అంటేనే యాంకర్ అనసూయ. ఆమె కోసమే జబర్దస్త్ ను చూసేవాళ్లు కోకొల్లలు. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో అయితే యాంకర్ రష్మీ. ఇద్దరూ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రెండు కళ్లలాంటి వాళ్లు. వీళ్లిద్దరు లేకుండా అసలు జబర్దస్తే లేదు. యాంకర్ సుమ తర్వాత బుల్లితెర మీద అంతటి క్రేజ్ ఉన్నది వీళ్లకే. ఇక.. జబర్దస్త్ లో వీళ్లు చేసే రచ్చ మామూలుగా ఉండదు.

jabardasth anasuya and rashmi to act in web series

jabardasth anasuya and rashmi to act in web series

యాంకర్ అనసూయ మాత్రం తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడితే.. యాంకర్ రష్మీ కూడా తన పొట్టి పొట్టి డ్రెస్సులకు కుర్రకారుకు కనువిందు చేస్తుంది. ఇద్దరూ యాంకర్లుగా మాంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కానీ.. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు అనే వార్తలు చాలా రోజుల నుంచి వింటున్నాం. జబర్దస్త్ లో ఫస్ట్ యాంకర్ గా అనసూయను తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత పేమెంట్ విషయంలో అనసూయ తప్పుకోగా.. రష్మీని తీసుకొచ్చారు. అప్పటి నుంచి యాంకర్ అనసూయ, రష్మీకి పడదు అనేది టాక్. నిజానికి.. తెర మీద కానీ.. ఏవైనా షోలలో కానీ.. బయట కలిసినప్పుడు కానీ.. ఇద్దరూ తెగ మాట్లాడేసుకుంటారు. కానీ.. లోపల మాత్రం బాగానే ఉందట.

Jabardasth : మల్లెమాల వెబ్ సిరీస్ లో నటించబోతున్న బుల్లితెర సిస్టర్స్

అయితే.. బుల్లి తెర సిస్టర్స్ గా ఉన్న వీళ్లు.. నిజంగానే తమ మధ్య ఎటువంటి వైరం లేదని నిరూపించే ప్రయత్నం చాలా సార్లు చేశారు. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు స్కిట్స్ కూడా చేశారు. ఇద్దరూ ఒకరి మీద మరొకరు జోక్స్ కూడా వేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా ఇద్దరూ కలిసి లీడ్ రోల్స్ లో ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. దాన్ని నిర్మించేది కూడా మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లేనట. వాళ్లే.. జబర్దస్త్ షోను కూడా నిర్వహించేది. ఇప్పుడు ఇద్దరు యాంకర్లను కలిపి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ కథ కూడా ఫైనల్ అయిందట. జులైలో షూటింగ్ మొదలవుతుందట. చూద్దాం మరి.. ఇద్దరు బుల్లితెర సిస్టర్స్ ఎలా వెండి తెర మీద అలరిస్తారో?

ఇది కూడా చ‌ద‌వండి ==> Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్? అమ్మాయి ఎవరు? షాకింగ్ నిజాలు చెప్పిన సుధీర్ తండ్రి?

ఇది కూడా చ‌ద‌వండి ==> renu desai : రేణు దేశాయ్ ఆస్తి అన్ని కోట్లా ..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ram gopal varma : వర్మ ఏంటీ ఆ ప‌ని.. జిమ్‌లో అరియానాతో రాం గోపాల్ వర్మ ర‌చ్చ మాములుగా లేదుగా..!

ఇది కూడా చ‌ద‌వండి ==> sreemukhi : డాన్స్ పర్ఫార్మెన్స్‌తో రచ్చ చేసిన శ్రీముఖి శేఖర్ మాస్టర్స్..!

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి