Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్? అమ్మాయి ఎవరు? షాకింగ్ నిజాలు చెప్పిన సుధీర్ తండ్రి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్? అమ్మాయి ఎవరు? షాకింగ్ నిజాలు చెప్పిన సుధీర్ తండ్రి?

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 June 2021,2:45 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెర మీద ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. సుడిగాలి సుధీర్ అంటే ఓ బ్రాండ్. ఇక.. సుధీర్ అనగానే మనకు గుర్తొచ్చే మరో పేరు యాంకర్ రష్మీ. ఇద్దరిదీ విడదీయలేని బంధం. అందుకే.. సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఆన్ స్క్రీన్ మీద మాంచి క్రేజ్ ఉంది. ఏది ఏమైనా.. బుల్లితెర మీద సుడిగాలి సుధీర్ తర్వాతనే ఎవరైనా. ఆయనకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూల్ది కాదు. సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి, ఆయన లవ్ గురించి, రష్మ, సుధీర్ గురించి.. ఇక వీటి గురించే సోషల్ మీడియాలో చర్చ, రచ్చ.సుడిగాలి సుధీర్.. వయసు అయిపోతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదని.. రష్మీతో తనకు లవ్ ఉందని.. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని ఆమధ్య వార్తలు తెగ వచ్చాయి.

jabardasth sudigali sudheer marriage fixed

jabardasth sudigali sudheer marriage fixed

కానీ.. అవన్నీ ఉత్తుత్తే అని తేలింది. చాలా సందర్భాల్లో రష్మీ కూడా తమ మధ్య ఏం లేదని చెప్పింది. సుధీర్ కూడా అదే చెప్పాడు. ఇద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని సుధీర్ కూడా చెప్పుకొచ్చాడు. నిజానికి.. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. కానీ.. అది ఉత్తదే అయిపోయింది.

Sudigali Sudheer : సింగిల్ గానే ఉండిపోవాలనిపిస్తోంది

అయితే.. పెళ్లిపై సుడిగాలి సుధీర్ అభిప్రాయం ఇంకోలా ఉంది. తనకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదంటున్నాడు సుధీర్. తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడూ సింగిల్ గానే ఉండిపోవాలని ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ.. మా ఇంట్లో వాళ్లు అస్సలు ఊరుకోవడం లేదు. ఎలాగైనా నాకు పెళ్లి చేయాలని ప్రాణం తీస్తున్నారు. కానీ.. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ.. అని చెబుతున్నాడు సుధీర్. కాకపోతే నాకు ఆ ఆమ్మాయి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అటువంటి అమ్మాయి దొరికితే నేను ఆలోచిస్తాను.. అంటూ సుడిగాలి సుధీర్ చెప్పగా.. ఎలాగైనా మా వాడికి త్వరలోనే పెళ్లి చేస్తాం. త్వరలోనే అమ్మాయి ఎవరో కూడా చెబుతాం.. అంటూ సుధీర్ తండ్రి చెప్పుకొచ్చారు. ఫాదర్స్ డే స్పెషల్ ఈవెంట్ సందర్భంగా సుడిగాలి సుధీర్.. తన తండ్రితో వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు.. తన తండ్రి ఎలాగైనా పెళ్లి చేస్తామని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చ‌ద‌వండి==> renu desai : రేణు దేశాయ్ ఆస్తి అన్ని కోట్లా ..?

ఇది కూడా చ‌ద‌వండి==> Ram gopal varma : వర్మ ఏంటీ ఆ ప‌ని.. జిమ్‌లో అరియానాతో రాం గోపాల్ వర్మ ర‌చ్చ మాములుగా లేదుగా..!

ఇది కూడా చ‌ద‌వండి==> sreemukhi : డాన్స్ పర్ఫార్మెన్స్‌తో రచ్చ చేసిన శ్రీముఖి శేఖర్ మాస్టర్స్..!

ఇది కూడా చ‌ద‌వండి==> Viral Video : వార్నీ.. ఈ ఊపుడేంది స్వామీ.. పెళ్లి డ్యాన్స్ లో వరుడి ఊపుడు చూస్తే నవ్వు ఆపుకోలేరు?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది